Switch to English

కరోనా పైత్యం: అరకిలో పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ సరిపోతుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోవడమంటే ఇదే మరి.! లేకపోతే, మిల్లీగ్రాముల్లో వుండే పారాసిటమాల్‌ మోతాదుని, గ్రాముల లెక్కల్లో వేసుకోవాలని చెప్పడమేంటి.? పైగా, అది కూడా అర కిలోగ్రాము పైబడి డోస్‌ అంటే మాటలా.? తనను తాను డాక్టర్‌గా చెప్పుకునే ఓ ఉన్నతాధికారి మీడియా ముందుకొచ్చి మరీ చెప్పిన ‘ప్రిస్క్రిప్షన్‌’ ఇది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఇటీవల కరోనాపై స్పందిస్తూ, ‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే సరి.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే సరి..’ అంటూ చిట్కా వైద్యం చెప్పిన విషయం విదితమే. ముఖ్యమంత్రి, అంత తేలిగ్గా కరోనా వైరస్‌ గురించి మాట్లాడితే, ఆయన కింద పనిచేసే అధికారులు ఇంకెలా వుంటారు.? పైగా, ఆయనగారికి ‘పదవి’ కూడా, ‘నామినేటెడ్‌’ కోటాలో దక్కింది మరి. అదీ అసలు సంగతి.

ఓ ఉన్నతాధికారి అయి వుండీ, పార్టీ కార్యకర్తలా ఇటీవలే సోషల్‌ మీడియాలో ఆయనగారు చేసిన ఓ పోస్టింగ్‌ వివాదాస్పదమయ్యింది. ఇప్పుడేమో, ఏకంగా 650 గ్రాముల పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌.. అంటూ తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంటే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దల్లో ‘చలనం’ ఇంత బాగా కన్పిస్తోంది.

ఎన్నికలే ముఖ్యం, ప్రజారోగ్యంతో మాకేంటి సంబంధం.? అన్నట్లు అధికార పార్టీ వ్యవహరిస్తుండడంపై జాతీయ స్థాయిలో మొట్టికాయలు పడుతున్నా, సదరు ప్రముఖుల తీరు మాత్రం మారడంలేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అధికార యంత్రాంగం (అందరూ కాదు లెండి, ఒకరిద్దరు మాత్రమే) ఇలా వ్యవహరిస్తోంటే, వాళ్ళు కాస్తా ఉన్నత స్థానంలో వుండడం రాష్ట్ర ప్రజలకు శాపం కాక మరేమిటి.? సదరు ప్రముఖుల తీరు చూసి, మిగతా అధికారులు విస్తుపోతున్నారు.

‘పొరపాటున నోరు జారారేమో..’ అని కూడా సమర్థించలేని పరిస్థితి వుందిక్కడ. ఎందుకంటే, కరోనా వైరస్‌ తీవ్రత అలాంటిది. యావత్‌ భారతదేశమే స్తంభించిపోయేలా నిర్ణయాలు జరుగుతున్నాయి కరోనా కట్టడి కోసం. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు కావొచ్చు, వారి కనుసన్నల్లో పబ్బం గడుపుకుంటున్న ఒకరిద్దరు ఉన్నతాధికారులు కావొచ్చు.. కామెడీలు ఆపితే మంచిది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...