Switch to English

వన్‌ అండ్‌ ఓన్లీ మెగా ‘చిరంజీవి’తం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు సినిమా వసూళ్లకి సరికొత్త అర్ధం చెప్పారు. అంతకు ముందూ గొప్ప నటులున్నారు. కానీ, తెలుగు సినిమాకి కమర్షియల్‌ వెలుగులు ఎన్టీఆర్‌ హయాంలోనే వచ్చాయి. ఆ కమర్షియల్‌ సినిమాని ఇంకో మెట్టు ఎక్కించిన ఘనత మెగాస్టార్‌ చిరంజీవికే దక్కుతుంది. తెలుగు సినిమా గమనాన్ని చిరంజీవి పరుగులు పెట్టించారనడం అతిశయోక్తి కాదేమో. ఫలానా సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది.? ఎన్ని ధియేటర్స్‌లో ఆడింది.? వంటి చర్చలు గట్టిగా మొదలైంది మాత్రం మెగాస్టార్‌ చిరంజీవితోనే.

150 సినిమాలు చేయడం ఆషా మాషీ విషయం కాదు. నిజానికి ఎన్టీఆర్‌ కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు కావచ్చు. సూపర్‌ స్టార్‌ కృష్ణ కావచ్చు. అంతకన్నా ఎక్కువ సినిమాలే చేసేశారు. కానీ, యువతరాన్ని ఉర్రూతలూగించిన స్టార్‌ హీరోగా చిరంజీవి తిరుగులేని పేరు ప్రఖ్యాతలు గడించారు. సుప్రీమ్‌ హీరో, మెగాస్టార్‌.. ఇవన్నీ అభిమానులు చిరంజీవికి ఇచ్చుకున్న బిరుదులు మాత్రమే. అలాంటి పిలుపుల కంటే, ‘అన్నయ్యా’ అనే పిలుపు తనకి చాలా ఇష్టమని చిరంజీవి చెబుతుంటారు.

చిరంజీవి నిజానికి అసలు పేరు కాదు. కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌ సినిమాల కోసం చిరంజీవిగా మారాడు. తెలుగు సినిమా కమర్షియల్‌ సత్తా ఏంటో, ఇండియన్‌ సినిమాకి చూపించిన చిరంజీవి, ఈ క్రమంలో అక్కడక్కడా కొన్ని ఫెయిల్యూర్స్‌ కూడా చవి చూశారు. ఫెయిల్యూర్స్‌కి కుంగిపోలేదు. సక్సెస్‌లకు పొంగిపోలేదు. కమర్షియల్‌ బాట వీడి కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసిన చిరంజీవి, వాటితో పేరు ప్రఖ్యాతలు సంపాదించారేమో కానీ, కమర్షియల్‌ విజయాల్ని చవి చూడలేకపోయారు.

సొంత బ్యానర్‌లో ‘రుద్రవీణ’ సినిమా చేసి, దేశం దృష్టిని ఆకర్షించారు. కమర్షియల్‌గా ఒక్కో మెట్టూ పైకి ఎక్కుతూ, ఇంకెవ్వరికీ అందనంత ఎత్తున నెంబర్‌ వన్‌ ఛైర్‌లో సెటిలైపోయిన చిరంజీవి, అనూహ్యంగా రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. రాజకీయాల్లోకి వెళ్లి, సినిమాలకు దూరమైపోయిన చిరంజీవి, తొమ్మిదేళ్ల తర్వాత అభిమానుల కోరిక మేరకు ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా చేశారు. వస్తూనే బాక్సాఫీస్‌ రికార్డుల్ని మళ్లీ తిరగరాశారు.

అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చిరంజీవే నెంబర్‌ వన్‌. సినిమా సినిమాకీ, నెంబర్ల ఈక్వేషన్‌ మారిపోతున్న ఈ రోజుల్లో చిరంజీవిలా సుదీర్ఘ కాలం నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో కొనసాగేది ఎవరు.? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఓ సందర్భంలో చిరంజీవి ప్రస్థావన వస్తే, ఒకటి నుండి పది వరకూ చిరంజీవి గారే. మేమంతా 11 నుండి స్టార్ట్‌ చేయాలి అన్న మాటలు నూటికి నూరు పాళ్లూ నిజం. ఇదీ మెగా చిరంజీవితం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...