Switch to English

క్యాంటీన్ వేడి చల్లారుస్తున్నారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్ల మూసివేతపై కొనసాగుతున్న రగడను చక్కదిద్దడంపై అధికార వైఎస్సార్ సీపీ దృష్టి సారించింది. ఈ అంశంలో భారీగా డ్యామేజీ జరగడంతో దిద్దుబాట చర్యలు ప్రారంభించింది. త్వరలోనే వైఎస్సార్ క్యాంటీన్ల ను ప్రారంభించనుంది. తొలుత ఆస్పత్రుల్లో వీటిని మొదలుపెట్టి.. నెమ్మదిగా విస్తరించనుంది. అన్న క్యాంటీన్ల మూసివేత విషయంలో జగన్ సర్కారు అనాలోచిత నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది పేదలపై ప్రభావం చూపే ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉండగా.. తొందరపాటుతో వాటిని మూసివేసి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి తానే అస్త్రాన్ని అందించినట్టయింది.

పేదల కడుపు నింపే ఈ పథకాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అటు ఏపీ, ఇటు తెలంగాణలో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పేరుతోనే కొనసాగుతుండగా ఏపీలో మాత్రం ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చి కొనసాగించారు. ఇలా ప్రజామోదం పొందిన పథకాలకు స్వల్ప మార్పులు చేసైనా కొనసాగిస్తే ఎలాంటి సమస్యా ఉండదు.

కానీ ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు మాత్రం ఇందుకు భిన్నమైన ధోరణిలో వెళ్తుండటం విమర్శలకు తావిచ్చింది. రూ.5కి పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకు ప్రత్యామ్నాయం చూపకుండానే మూసివేసింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చక్కని అస్త్రం లభించడంతో చెలరేగిపోయింది. క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ ఆందోళనలు మొదలుపెట్టింది. సహజంగానే వీటికి ప్రజల నుంచి మద్దతు లభించింది. తాము క్యాంటీన్లను మూసివేయడంలేదని, ఆహార సరఫరా సంస్థతో ఒప్పందం ముగిసిపోవడంతోనే వాటిని తాత్కాలికంగా మూసివేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని అధికార పార్టీ నేతలు చెప్పినా జనాలు సంతృప్తి చెందలేదు.

దీంతో ఆత్మరక్షణలో పడిన జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వెంటనే అన్న క్యాంటీన్లను తెరిస్తే ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీలోకి వెళుతుందనే భావనతో రాజకీయం ప్రదర్శించింది. తొలుత ఆస్పత్రుల్లో వైఎస్సార్ క్యాంటీన్లను తెరుస్తామని ప్రకటించింది. వీటిని అన్న క్యాంటీన్లకు కొనసాగింపులా జనం భావించకుండా తమ పథకంగానే గుర్తించాలని వైఎస్సార్ సీపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. అనంతరం రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రదేశాలకు విస్తరిస్తారు. మొత్తమ్మీద క్యాంటీన్ వేడిని ఇలా చల్లార్చాలని నిర్ణయించారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...