Switch to English

దేశం మనదీ.. జెండా మనదీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఎవరైనా కలలోనైనా ఊహించారా.? జమ్ము కాశ్మీర్‌ భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలలానే ఉండబోతోందని. ఎవరైనా అనుకోగలిగారా.? లేదు. ఎందుకంటే, మనది ప్రజాస్వామ్య భారతం. భిన్నత్వంలో ఏకత్వం.. మనకి మాత్రమే సాధ్యమైన ఓ అద్భుతం. దురదృష్టవశాత్తూ, కొందరికి ఆ అద్భుతం అవకాశంగా మారిపోయింది. ఎక్కడికక్కడ విభజన రేఖలు గీసేశారు. కులం, మతం, ప్రాంతం.. ఇలా ఒకటేమిటి.? భారతీయుల మధ్య ఎన్నో అడ్డు గీతలున్నాయి. అదే మన బలం, బలహీనత. ఇన్ని అభిప్రాయాలు ఉన్నా, దేశమంతా ఒక్కటై ముందుకు సాగుతోందంటే, అది మనకి గర్వకారణం.

అవును, దేశం మనది, జెండా మనది. మహాత్మా గాంధీ కులం గురించి ఆలోచించలేదు. సుభాష్‌ చంద్రబోస్‌ మతం గురించి లెక్క చేయలేదు. ఝాన్సీ లక్ష్మీభాయ్‌ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఒకరా, ఇద్దరా.? వేలాది మంది, లక్షలాది మంది దేశం కోసం ప్రాణాలర్పించారు. వాళ్లెవ్వరికీ కులం లేకపోలేదు. మతం లేకపోలేదు. అందరిదీ ఒకే అజెండా. అదే భారతదేశం. భారతదేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో ఆసేతు హిమాచలం ఒక్కటైంది. అందరిదీ ఒక్కటే మతంగా మారింది. ఒక్కటే నినాదమైంది. ఒక్కటే ప్రాంతమైంది. రంగుల్లేవ్‌. మతాల్లేవ్‌. కులాల్లేవ్‌. నేను భారతీయుణ్ణి. ఇదొక్కటే నినాదం. అంతలా ఏకమవ్వబట్టే మనం ఈ రోజు స్వేఛ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నాం. నా భారతదేశం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.

మహనీయుల్ని, తలచుకోవడానికి ఆగస్ట్‌ 15, జనవరి 26 మాత్రమే సరిపోవు. అనుక్షణం గుండెల్లో భారతీయత ఉప్పొంగాలి. అదే, ఆ మహనీయులకు మనమిచ్చే ఘనమైన నివాళి. జెండాలు పట్టుకు తిరుగుతాం. అజెండాలు మార్చేసుకుంటాం. ఒకరికొకరు తిట్టుకుంటాం. అంతా మా ఇష్టం అనుకునే ముందు, నేను భారతీయుణ్ణి అని మాత్రం మర్చిపోకూడదు. ఏం చేసినా భారతీయతకు లోబడి మాత్రమే చేద్దాం. ఎందుకంటే, పొరుగునున్న పురుగు దాడికి సిద్ధమవుతోంది. ఆ దాడి ఏ రూపంలో ఉంటుందో, ఎలా ఉంటుందో చెప్పలేం.

పురుగుని పీకి అవతల పడేసే శక్తి మనకున్నా, ఈ క్రమంలో ఆపద మనకీ ఎంతో కొంత పొంచి ఉంటుంది. దేశం మీసం మెలేయ్యాల్సిందే. దేశమంతా, ఒక్క తాటిపై నిలబడాల్సిందే. మేధావుల ముసుగులో ముష్కరుల తరపున వకాల్తా పుచ్చుకునే, దేశ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉందాం. భారత్‌ మాతాకీ జై. ఒక్కసారి కాదు, వందసార్లు కాదు, వెయ్యి సార్లు కాదు.. అనుక్షణం ఈ నినాదం మార్మోగాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...