ప్రస్తుతం ఓటిటిలు కంటెంట్ విషయంలో రాజ్యమేలుతున్నాయి. డిజిటల్ విప్లవం పూర్తిగా తన రెక్కలు విప్పుకున్న నేపథ్యంలో స్టార్ నటులు కూడా ఓటిటిలో నటించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ నిర్మించనుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారు. అటు షాహిద్ కు, ఇటు సేతుపతికి ఇదే తొలి వెబ్ సిరీస్ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ప్రస్తుతం షాహిద్ కపూర్ జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగులో నాని నటించిన సూపర్ హిట్ మూవీకి ఇది రీమేక్. విజయ్ సేతుపతి పలు తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు.
542048 766583really good post, i undoubtedly adore this remarkable site, carry on it 551938