Switch to English

ప్రజల ఆశయాలే.. పార్టీ సిద్ధాంతాలు.. పరమ రొటీన్ డైలాగ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

రాజకీయ పార్టీలు స్థాపించేది ప్రజలకు సేవ చేయడానికా.? అధికార పీఠమెక్కి అయినవారికి పదవులు ఇచ్చుకోవడానికా.? అన్న ప్రశ్నకు.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అధికార వైసీపీనే ఖచ్చితమైన సమాధానం చెపేసింది. ప్రజాసేవ, వంకాయ.. వంటి కబుర్లు ఈ రోజుల్లో ఏ రాజకీయ పార్టీ చెప్పినా.. అది పరమ రొటీన్ అలాగే బోరింగ్ డైలాగ్ అవుతుంది.

ప్రజల ఆశయాలే పార్టీ సిద్ధాంతాలంటూ తెలంగాణలో తాను స్థాపించబోతున్న కొత్త రాజకీయ పార్టీ గురించి షర్మిల వ్యాఖ్యానించడంపై పెదవి విరుపులు ఎందుకు కనిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం.. ముఖ్యమైన పదవులన్నీ ఓ సామాజిక వర్గానికే దక్కుతున్నాయి. అందునా, ఓ మతానికి చెందినవారికి కీలక పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న విమర్శలున్నాయి. ‘అబ్బే, అదేం లేదు..’ అని అధికార పార్టీ మద్దతుదారులు ఎంత బుకాయించినా, అందులో అర్థం లేదు.

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నది కూడా, ఆ సామాజిక వర్గం కోసం, ఆ మతం కోసం.. అన్న చర్చ కొంతకాలంగా జరుగుతూనే వుంది. ‘బలవంతపు మత మార్పిడులే లక్ష్యంగా తెలుగు నాట కొందరు రాజకీయాలు చేస్తున్నారు..’ అన్న విమర్శ ఈనాటిది కాదు. జనాభా లెక్కలు జరగడంలేదుగానీ, ఆ లెక్కలు తీస్తే.. రాష్ట్రంలో గడచిన రెండు దశాబ్దాల్లో బలవంతపు మత మార్పిడులు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతుంది.

సరే, ఇవన్నీ ‘గిట్టని పార్టీలు చేసే దుష్ప్రచారం’ అనే వాదన ‘కొందరి’ నుంచి రావడం మామూలే. ఇక, తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్న షర్మిల, పోలవరం ప్రాజెక్టు గురించీ పోతిరెడ్డిపాడు వ్యవహారం గురించీ, విభజన హామీల గురించీ మాట్లాడకుండా రాజకీయాలు చేస్తామంటే ఎలా.? 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఏపీలో ప్రచారం చేశారు. అంతే, అక్కడితో ఆమెకి ఆంధ్రపదేశ్ రాష్ట్రంతో అవసరం తీరిపోయిందని అనుకోవాలేమో.

ఏపీ రాజకీయాల గురించి మాట్లాడకుండా తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేసి.. ప్రజలూ, ప్రజాస్వామ్యం, సిద్ధాంతాలు.. అని నినదిస్తే జనం గుడ్డిగా నమ్మేస్తారనుకోవడం పొరపాటు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...