Switch to English

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.. వైఎస్ జగన్, బొత్సకి సూచించారని గతంలో ప్రచారం జరిగింది.

బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న విషయం విదితమే. సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద విపరీతమైన నెగెటివిటీ నేపథ్యంలో ఆయన్ని తప్పించి, బొత్స ఝాన్సీని వైఎస్ జగన్ రంగంలోకి దించారు. ఎంవీవీ సత్యనారాయణ అసలు టిక్కెట్ దక్కించుకోలేరని అంతా అనుకున్నారుగానీ, ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ దక్కింది.. దానికోసం ఆయన చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చిందని విశాఖలో జనం చెవులు కొరుక్కుంటున్నారు.

ఎంవీవీ సత్యనారాయణ గెలిచే అవకాశం లేదని వైసీపీ సొంత సర్వేల్లోనే తేలుతోందిట. మరి, బొత్స ఝాన్సీ పరిస్థితేంటి.? అంటే, ఆమెకీ ఓటమి తప్పేలా లేదట. ఆమె గనుక విజయనగరం నుంచే పోటీ చేసి వుంటే, అది ఆమెకీ, వైసీపీకీ అనుకూలంగా వుండేది. అన్నిటికీ మించి, బొత్స సత్యనారాయణకి చాలా చాలా బలంగా వుండేది.

చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ అసెంబ్లీకి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి చీపురుపల్లి చాలా బలమైన నియోజకవర్గం బొత్సకి. ఇదే స్థానం నుంచి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుని బరిలోకి దించాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. కానీ, చివరి నిమిషంలో నిర్ణయాలు మారిపోయాయి.

దాంతో, బొత్స సత్యనారాయణ ఊపిరి పీల్చుకున్నారు. గంటా గనుక చీపురుపల్లిలో పోటీ చేసి వుంటే, తేలిగ్గానే గెలిచేది టీడీపీ. జనసేన నుంచైనా గంటా శ్రీనివాసరావుని బరిలోకి దించాలని టీడీపీ – జనసేన కలిసి భావించాయి.

కారణాలేవైనా, బొత్సకి ఈ విషయం బాగా కలిసొచ్చింది. ప్రచారం మొదలైంది.. జోరుగా సాగింది, సాగుతూనే వుంది.! ఏమయ్యిందోగానీ, చీపురుపల్లి వైసీపీ శ్రేణుల్లో ‘బొత్స ఓడిపోతారేమో..’ అన్న బయం బయల్దేరింది. కూటమి క్యాండిడేట్ కిమిడి కళా వెంకటరావు, బొత్స కంటే స్ట్రాంగ్ అని అనలేం. కానీ, కిమడి కళా వెంకట్రావుకి అన్నీ కలిసొచ్చేస్తున్నాయిప్పడు.

అనూహ్యంగా బొత్సకి నెగెటివ్ వేవ్ షురూ అయ్యింది చీపురుపల్లిలో. వైసీపీ శ్రేణుల్లో నీరసం ఆవహించేయడంతో బొత్స అనూహ్యంగా వెనుకబడిపోయారు. ఇదంతా కేవలం వైసీపీ సర్కారు మీదున్న వ్యతిరేకతే అనుకుంటే పొరపాటు. అంతకు మించి, బొత్స కుటుంబంపై వ్యతిరేకత.. చీపురుపల్లిలో బొత్స ఓటమికి కారణమయ్యేలా వుంది.

చివరి నిమిషంలో బొత్స మార్క్ ఎలక్షనీరింగ్ ఆయన్ని గెలిపిస్తుందా.? ఆ ఎలక్షనీరింగ్‌లో కూటమి ఇప్పటికే పక్కా వ్యూహం రచించుకున్న దరిమిలా, బొత్సకి ఓటమి తప్పదా.? వేచి చూడాల్సిందే.

ఇటు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఓటమి, అటు ఆయన సతీమణి బొత్స ఝాన్సీ ఓటమి.. ఈ రెండూ గనుక జరిగితే, విజయనగరం జిల్లా రాజకీయాల నుంచి బొత్స కుటుంబం ఈసారి పూర్తిగా ఔట్ అయిపోతుందనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది.

బొత్స ఝాన్సీ, విశాఖ నుంచి పోటీ చేయకుండా విజయనగరం నుంచే లోక్ సభకు పోటీ చేసి వుంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని, బొత్స అనుచరులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. స్వయానా బొత్స కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.!

ఎందుకిలా జరిగిందబ్బా.? వైసీపీలో ఎవరు చక్రం తిప్పితే, ఇలాంటి పరిస్థితి బొత్స కుటుంబానికి వచ్చిందబ్బా.? ఇదిప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ అవుతున్న అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...