Switch to English

వైఎస్ జగన్ ఛలో ఢిల్లీ.. ఏపీకి ఏం తీసుకురాబోతున్నారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాస్సేపట్లో డిల్లీకి పయనమవుతున్నారు. ఓ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించడం, రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే. కానీ, వైఎస్ జగన్ ఢిల్లీకి వెళుతున్నారంటే, తన మీద వున్న కేసుల విషయమై కేంద్రం వద్ద సాగిలాపడ్డానికేనన్న విమర్శలే గట్టిగా వినిపిస్తుండడం.. అదీ ప్రతిసారీ అలాంటి చర్చే జరుగుతుండడం గమనార్హం.

ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారు.. ప్రత్యేక హోదా తెచ్చారు.. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారు రైల్వే జోన్ అంశంపై స్పష్టత తెచ్చారు.. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారు.. రాజధానిపై గందరగోళానికి తెరదించారు.. ఇలాంటి మాటలేవీ గడచిన రెండేళ్ళుగా వినిపించడంలేదు. ఈసారి కూడా అలాంటి కీలకమైన విషయాలపై కేంద్రం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సానుకూలమైన స్పందన వస్తుందని అనుకోలేం.

పోనీ, అవి కాంప్లికేటెడ్ అంశాలనుకుందాం. కరోనా వ్యాక్సినేషన్ విషయమై రాష్ట్రం ఆశిస్తున్న రీతిలో అయినా వ్యాక్సిన్ల కేటాయింపు జరుగుతుందా.? రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లు పేదలకు నిర్మిస్తోన్న కాలనీలకు మౌళిక వసతుల కోసం కేంద్రం నిధులు ఇచ్చేందుకు ముందుకొస్తుందా.? ఇలాంటి ప్రశ్నలు కూడా చాలానే వున్నాయి. ‘అయినను పోయి రావలె హస్తినకు..’ అన్న చందాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ‘ఉత్త యాత్ర’గా మిగిలిపోతే అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటుండదు.

‘ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర ద్వారా ప్రభుత్వ ఖజానానికి ఎంతో కొంత నష్టం తప్ప లాభమైతే లేదు.. దారి ఖర్చులు దడగ..’ అన్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో వినిపించడం ఇదే కొత్త కాదు. చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటి మాటలే వినిపించాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక రాష్ట్రానికి చాలా సమస్యలున్నాయి.. వేటినీ పరిష్కరించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంలేదు. అయినా, రాష్ట్రంలో అధికారంలో వున్నవారు కేంద్రాన్ని నిలదీయడంలేదు. ఎందుకిలా.? అధికారమంటే హోదా, దర్పం తప్ప.. బాధ్యత అని, ప్రజలకు సేవ చేయాలి, రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన పాలకుల్లో లేకపోవడమేంటి.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...