Switch to English

రవితేజ ‘క్రాక్’ మూవీ రివ్యూ – రొటీన్ మాస్ మసాలా.!

Critic Rating
( 2.50 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
Movie క్రాక్
Star Cast రవితేజ, శృతి హాసన్, సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్ కుమార్
Director గోపీచంద్ మలినేని
Producer బి. మధు
Music ఎస్ థమన్
Run Time 2 గంటల 34 నిముషాలు
Release జనవరి 09, 2021

మాస్ మహారాజ్ రవితేజ నటించిన  మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘క్రాక్‘. గత ఏడాది సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఫైనల్ గా సంక్రాంతి కానుకగా తెలుగులో మొదటి సినిమాగా విడుదలైంది. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రవితేజ, ఈ సారి ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రవితేజకి కావాల్సిన మెయిన్ హిట్ ఇచ్చిందో? లేదో? ఇప్పుడు చూద్దాం..

కథ:

వీరశంకర్ పోతురాజు(రవితేజ) ఓ పవర్ఫుల్ సిఐ. తన కంట్రోల్ లో ఉన్న ఏరియాలో ఎవడు ఏ తప్పు చేసినా వాడి తాట తీస్తాడు. అలాగే ఎవడైనా ‘బ్యాక్ గ్రౌండ్’ అనే మాట వాడితో కంట్రోల్ తప్పుతాడు, అవతల వాడు ఎంత వాడైనా వాడి గూబ పగిలిపోద్ది. అలాంటి శంకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీంని పట్టుకున్నాడని కడపకి షిఫ్ట్ చేస్తారు. ఆ టైములో కడపలో ఓ చిన్న క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యున్న కొండారెడ్డి(రవి శంకర్)కి ఎస్.పి వార్నింగ్ ఇస్తాడు. వచ్చే వాడు పెద్ద క్రాక్ గాడు, వాడి గురించి తెలియాలంటే రాజమండ్రి జైల్లో ఒకడున్నాడు వెళ్లి కలవు అనగానే.. వెళ్లి జైల్లో ఉన్న కటారి శ్రీను(సముద్ర ఖని)ని కలుస్తాడు. ఒకప్పుడు ఒంగోలుకి కింగ్ మేకర్ లా బ్రతికిన కటారి శ్రీను జైల్లో ఎందుకు ఉన్నాడు? వీర శంకర్ కి – కటారి శ్రీనుకి మధ్య ఏం జరిగింది? ఏ విషయంలో కటారి శ్రీను తప్పు చేసి వీర శంకర్ కి దొరికాడు. ఎవరి మీద ఎవరి గెలిచారు? కటారి కథ విన్నాక కొండారెడ్డి ఏం చేసాడు? అనేది తెలియాలి అంటే క్రాక్ చూడాల్సిందే..

తెరమీద స్టార్స్..

మాస్ మహారాజ్ ని చాలా రోజుల తర్వాత తన అభిమానులు కోరుకునే ఫుల్ మాస్ పాత్రలో కనిపించాడు. పోలీస్ పాత్రలో తన వంతుగా అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో, మాస్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. కానీ ఆ పాత్రని స్టార్టింగ్ లో పరిచయం చేసినదాన్ని బట్టి, ఇంకా హై రేంజ్ లో, ఎంటర్టైనింగ్ గా చెప్పి ఉండచ్చు అనే ఫీలింగ్ అయితే పక్కాగా వస్తుంది. శృతి హాసన్ క్యూట్ లుక్స్ తోనే కాకుండా, మాస్ డాన్సులతో, మెయిన్ గా ఓ కీలకమైన సీన్స్ లో పవర్ఫుల్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. ఇక సినిమాలో హీరోకి పోటీగా విలన్ పాత్రలో కనిపించిన సముద్రఖని విలన్ గా పరవాలేధనిపించాడు. ఆ పాత్రని పవర్ఫుల్ గా చూపించినా, పలు చోట్ల మరీ వీక్ గా చూపించేసినట్లు అనిపిస్తుంది. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ కి అయితే సరైన పాత్ర ఇవ్వలేదనే చెప్పాలి. ఇలాంటి పాత్రల్లో మనం వరలక్ష్మీని ఇప్పటికే చూసేసాం.

తెర వెనుక టాలెంట్..

క్రాక్ సినిమాకి రెండు మూడు డిపార్ట్ మెంట్స్ వారు పరవాలేదనిపించారు. అందులో మొదటిది.. జికె విష్ణు సినిమాటోగ్రఫీ.. కొన్ని కొన్ని చోట్ల పక్కన పెట్టేస్తే.. మిగిలిన చోట్ల విజువల్స్ సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి చూసారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో డిఫరెంట్ షాట్స్ ట్రై చేయడంతో కాస్త ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఆ విజువల్స్ కి థమన్ అందించిన నేపధ్య సంగీతంతో ఆడియన్స్ ఇంకాస్త బాగా కనెక్ట్ అవుతారు. కానీ కొన్ని చోట్ల అవసరం లేదు అనిపిస్తున్నా అక్కడ కూడా హై మ్యూజిక్ ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక సాయిమాధవ్ బుర్రా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ సినిమాకి కీలక సన్నివేశాల్లో హెల్ప్ అయ్యాయి. ఎడిటర్ ఇంకాస్త షార్ప్ చేసుంటే బాగుండేది.

ఇక కెప్టెన్ అఫ్ ది షిప్ గోపీచంద్ మలినేని విషయానికి వస్తే.. ముందుగా కథ.. ఒక విలన్ ఒక పోలీసు వచ్చి విలన్ ని కొట్టడం బొక్కలో వేయడం.. ఇదే సినిమాని గత మూడు నాలుగు జెనరేషన్స్ గా చూస్తూనే ఉన్నాం. ఇందులో కొత్తగా తీసుకోవాలనుకుంది క్రాక్ అనే పాత్ర హీరోకి ఇవ్వడమే.. కానీ ఆ పాత్రని చెప్పిన దానికి, దానిచుట్టూ డిజైన్ చేసిన సీన్స్ కి అంత పొంతన లేదు. అలాగే ఆ పాత్రని ఇంకా చాలా అంటే చాలా బెటర్ గా చేసుండాల్సింది. వెంకీ వాయిస్ ఓవర్ లో చెప్పిన పాయింట్, ఒక్కో సారి క్రైమ్ లో చిన్న చిన్న పాయింట్స్ కీలక మలుపులు తిరుగుతాయని.. ఆ పాయింట్ కరెక్ట్ ఏ కానీ ఈ కథలో హీరోకి, విలన్స్ కి అంత సిల్లీ పాయింట్స్ వాడడం పెద్ద కిక్ ఇవ్వదు. వాడో పెద్ద క్రాక్ గాడు అనే డైలాగ్ ని జస్టిఫై చేసేలా రవితేజ పాత్రని డిజైన్ చేసుకోలేదు. స్క్రీన్ ప్లే కూడా చిన్న పిల్లాడు గెస్ చేసేలా ఉంటుంది.. సారీ సారీ గెస్ కాదు, ఏ సీన్ ఏ సినిమాలో ఉందో అని చెప్పగలిగేలా ఉన్నాయి. మేము తీసింది గ్రేట్ అనుకునే భ్రమలోఅదే మూస పద్దతిలో ఇరుక్కుపోయి ప్రేక్షకులకు చిరాకు తెప్పించే రొటీన్ రొట్ట కమర్షియల్ సినిమాల ఉంది. ఇక డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని అబ్బా అదిరిపోయేలా ఉన్నాయి ఈ సీన్స్, పిచ్చెక్కిపోయేలా తీసాడు అని చెప్పుకునే సీన్స్ ఏమీ లేవు. ఓవరాల్ గా కమర్షియల్ అనే పేరుతో తీసిన అదే సినిమాల్ని మళ్ళీ తీశారు.

విజిల్ మోమెంట్స్:

– రవితేజ మాస్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్
– సుధాకర్ మర్డర్ సీన్ ఎపిసోడ్
– బస్ స్టాండ్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్
– కొన్ని హీరో – విలన్ ఛాలెంజింగ్ సీన్స్

బోరింగ్ మోమెంట్స్:

– వీక్ క్యారెక్టరైజేషన్స్
– విలన్ స్ట్రాంగ్ అనిపించకపోవడం
– రొటీన్ కథ
– ఊహించిన కథనం
– రవితేజ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం
– సాగదీసిన రన్ టైం
– వీక్ డైరెక్షన్

విశ్లేషణ:

మాస్ మహారాజ్ రవితేజ పవర్ఫుల్ కాప్ రోల్, అందులోనూ టైటిలే ‘క్రాక్’ అని పెట్టారు కాబట్టి అటు ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, ఇటు మంచి హీరోయిజం ఉంటదని అనుకొని థియేటర్ కి వెళ్లిన ప్రతి ఒక్కరూ థియేటర్ లో నిరుత్సాహ పడడం ఖాయం. అంతే కాకుండా తీసిన కథలే, తీసిన సీన్లే, కెమెరా అటు మార్చి ఇటు మార్చి ఇంకెన్ని రోజులు తీస్తారయ్యా అనుకుంటారు. రవితేజ సినిమాలో ఉండే ఒక్క పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ తప్ప ఇంకేమీ లేవు. ఓవరాల్ గా చూసేసిన సినిమాకి ‘క్రాక్’ అనే టైటిల్ తో రంగులేసి సేల్ చేద్దామనుకున్నారు కానీ ఆడియన్స్ రియాక్షన్స్ బెడిసి కొట్టేసింది. రవితేజకి కావాల్సిన హిట్ ని క్రాక్ కూడా ఇవ్వలేకపోయింది..

చూడాలా? వద్దా?: క్రాక్ – అబ్బే, దీని బదులు రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాలు ఏది చూసినా ఫ్రీగా ఇంతకన్నా ఎక్కువ ఎంటర్టైన్ అవుతారు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.25/5 

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...