2020.. ప్రపంచ మానవాళికి అత్యంత చేదు సంవత్సరం. కరోనా మహమ్మరి ప్రపంచాన్ని అల్లకల్లొలం చేసిన ఏడాది ఇది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరమైనా బాగుంటుంది అనుకునేవారికి ఆందోళన కలిగించే విషయం ఒకటి ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. 2020 కంటే 2021 మరింత భయానకంగా ఉండబోతోందన్నది దాని సారాంశం. మామూలుగా అయితే దీనిని ఎవరూ పట్టించుకోరు. కానీ ఆ విషయం చెప్పింది ప్రముఖ ఖగోళవేత్త నోస్ట్రడామస్. 20వ శతాబ్దంలో ఏం జరగబోతోందో ఆయన 16వ శతాబ్దంలోనే ఊహించి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు చాలావరకు నిజమయ్యాయి.
కరోనా విషయంతోపాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ఆయన చెప్పినవన్నీ అక్షరాలా నిజమయ్యాయి. దీంతో 2021లో కూడా నోస్ట్రడామస్ జోస్యం నిజమవుతుందేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముక్కుసూటిగా ఉండే బిడియం లేని మాటకారి అమెరికాను ఏలతాడని నోస్ట్రడామస్ చెప్పిన విషయం ట్రంప్ రూపంలో నిజమైంది. అలాగే 2020లో మహమ్మారి ఒకటి ప్రపంచాన్ని విలవిలాడిస్తుందని చెప్పిన అంశమూ ప్రత్యక్షంగా చూశాం.
2021లో ఏం జరగనుందో కూడా నోస్ట్రడామస్ అంచనా వేశారు. ఈ ఏడాది బయలాజికల్ వార్ జరగనుందని పేర్కొన్నారు. రష్యా జీవాయుధాన్ని తయారుచేస్తుందని.. దాని ఫలితంగా ప్రపంచం అంతమయ్యే అవకాశం ఉందని వివరించారు. తొలుత కొందరు యువకులకు ఇది వ్యాపించి.. క్రమంగా అంతా విస్తరిస్తుందని జోస్యం చెప్పారు. అలాగే ఈ ఏడాది వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని, అధిక సంఖ్యలో సౌరతుఫాన్లు సంభవిస్తాయని హెచ్చరించారు.
యుద్ధాలు కూడా జరిగే అవకాశం ఉందన్నారు. ఓ భారీ తోకచుక్క భూమిపైకి దూసుకొస్తుందని ఊహించారు. అలాగే మరో భారీ గ్రహ శకలం భూమిని ఢీకొట్టబోతుందని పేర్కొన్నారు. కరువు కాటకాలతో మానవాళి అల్లాడుతుందని తన జోస్యంలో తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే 2020 కంటే 2021 మరింత ప్రమాదకరమనే ఆందోళన వ్యక్తమవుతోంది.
612846 839150Oh my goodness! a great post dude. A lot of thanks Nevertheless We are experiencing issue with ur rss . Dont know why Can not sign up to it. Could there be anybody discovering identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 343891
602049 171670Audio began playing anytime I opened this site, so annoying! 617185
606636 322632In case you happen to excited about eco items, sometimes be tough shock to anyone them recognise that to assist make unique baskets just for this quite liquids carry basic steps liters associated ceiling fan oil producing. dc no cost mommy weblog giveaways family trip home gardening residence power wash baby laundry detergent 643269
856403 472966This is such a fantastic post, and was thinking much exactly the same myself. An additional fantastic update. 731921