ప్రస్తుతం కరోనా కారణంగా పూర్తిగా సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి అక్కడ స్థంభించింది. సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కాని, వీడియోలు సాంగ్స్ ఏమీ కూడా విడుదల చేయడం లేదు. అప్పుడప్పుడు హీరోల బర్త్‌డేలు ఉంటే ఏమైనా ప్రత్యేక వీడియోలు లేదా ఫొటోలు విడుదల చేస్తున్నారు. కాని ప్రత్యేకమైన రోజులు లేకుండా మాత్రం ఎలాంటి ప్రమోషనల్ వీడియోలు విడుదల చేసే పరిస్థితి లేదు. కాని రామ్ రెడ్ విషయంలో మాత్రం ఆశ్చర్యకర ప్రకటన వచ్చింది.
హీరో రామ్ ప్రస్తుతం రెడ్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. సినిమాకు మంచి అంచనాలున్నాయి. తెలుగులోనే కాకుండా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌కు కూడా భారీ మొత్తంలో రేటు పలికింది. ఈ రేటుతో రెడ్ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను చెప్పకనే చెప్పవచ్చు. సినిమా క్రేజ్ ను మరింతగా పెంచే ఉద్దేశ్యంతో రేపు చిత్ర యూనిట్ సభ్యులు సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నారు.
ఈనెల 15వ తారీకున రామ్ పుట్టిన రోజు ఉంది. ఈ మేకింగ్ వీడియో ఆయన బర్త్‌డే రోజున విడుదల చేయవచ్చు. కాని ముందే ఎందుకు ఈ మేకింగ్ వీడియోను విడుదల చేస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయినా ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశం లేదు. కాని ప్రమోషన్స్ మాత్రం అప్పుడే చేయడం విడ్డూరంగా ఉంది. రామ్ గత చిత్రం ఇస్మార్ట్ శంకర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రెడ్‌తో మరో విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తుండగా కరోనా కారణంగా రెడ్ చాలా ఆలస్యం అవ్వబోతుంది. పరిస్థితులు కుదుట పడితే ఈ ఏడాది చివరికి కాని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదంటున్నారు.
953152 937552I surely did not realize that. Learnt something new right now! Thanks for that. 944957
418612 521651Hello there! Great post! Please inform us when I will see a follow up! 266130
825389 124701You developed some decent points there. I looked more than the internet for any dilemma and located most individuals goes as nicely as together with your web site. 49711
870756 472196Im agitated all these post directories. It confident would be good to have every write-up directory that instantly accepts articles. 164669
565055 144297Id should consult you here. Which is not some thing It is my job to do! I spend time reading an post that may possibly get individuals to feel. Also, several thanks for permitting me to comment! 882363