Switch to English

18ఏళ్ళ కుర్రాడి కంపెనీలో 50% ఇన్వెస్ట్ చేసిన రతన్ టాటా

వారి దగ్గర ఏం ఉన్నా లేకపోయినా టాలెంట్ ఉంటే చాలు వారిని ప్రోత్సహించడంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా ముందుంటారు. ఆయన ఈ రోజు ప్రతి ఒక్క వ్యాపారంలో విజయం సాధించడానికి ఇదొక మెయిన్ రీజన్. కానీ ఆయన రీసెంట్ గా ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు అందరిలోనూ ఆసక్తిని పెంచాయి.

అసలు విషయంలోకి వెళితే.. ఓ 18 ఏళ్ళ కుర్రాడు స్థాపించిన ఒక ఫార్మా స్టార్టప్ కంపెనీలో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెట్టడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. అతనెవరంటే ముంబైలోని యంగ్ బిజినెస్ మేన్, జనరిక్ ఆధార్ సీఈఓ అర్జున్ దేశ్ పాండే. అతని కంపెనీలో రతన్ టాటా ఏకంగా 50 శాతం వాటాను కొనుగోలు చేశారు. 2018లో మెడిసిన్స్ ని అతి తక్కువ ధరలకు అందించాలనే సదుద్దేశంతో 15 లక్షలతో జనరిక్ ఆధార్ అనే స్టార్టప్ ను అర్జున్ దేశ్ పాండే మొదలు పెట్టాడు.

జెనరిక్ ఆధార్ ఒక ఫార్మసీ-అగ్రిగేటర్. జెనరిక్ తమ మెడిసిన్స్ ని తయారీదారు నుంచి డైరెక్ట్ గా చిల్లర వ్యాపారులకు చేరేలా ఏర్పాటయ్యింది. దళారీల దోపిడీని అడ్డుకొని తక్కువ ధరలకు మందులు అందించాలన్నదే దీని ఉద్దేశ్యం. ప్రభుత్వం ఆమోదించిన బ్రాండెడ్, జెనెరిక్, హోమియోపతి, ఆయుర్వేద ఔషధాలను మాత్రమే అందిస్తోంది. అంతే కాకుండా క్యాన్సర్ మందులను మార్కెట్ ధరకన్నా తక్కువకే అందించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంస్థ ద్వారా మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే సామాన్యులకు మందులు అందుతున్నాయి. ఫార్మసిస్ట్ లు, ఐటీ ఇంజనీర్లు, మార్కెటింగ్ నిపుణులతో కలుపుకొని సుమారు 55 మంది ఉద్యోగులున్న ఈ కంపెనీకి ముంబైలో 35 ఫ్రాంచైజీలు ఉండడం విశేషం.

న్యూఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, గోవా, రాజస్థాన్, గుజరాత్ లతో పాటు దేశవ్యాప్తంగా వెయ్యి ఫ్రాంఛైజీలను ఓపెన్ చేసేలా ప్రణాళిక రూపొందించింది. ఈ సంస్థ గురించి తెలుసుకున్న రతన్ టాటా అబ్బురపడి, వాళ్ళు ఫ్రాంచెజీలు విస్తరించాలనే ప్రయత్నంలో ఉన్నారని తెలిసిన వెంటనే రతన్ టాటా ఆ కంపెనీలో 50 శాతం వాటా కొనుగోలు చేయడానికి డిసైడ్ అయ్యారు. మా కంపెనీ టాలెంట్ ని గుర్తించి రతన్ టాటా లాంటి వారు ఇన్వెస్ట్ మెంట్ చేయడం సంతోషంగా ఉందని జనరిక్ ఆధార్ సీఈఓ దేశ్ పాండే తెలిపారు.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

నిమ్మగడ్డ ఎందుకు తగ్గినట్టు?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తాను చార్జి తీసుకుంటున్నట్టు నిమ్మగడ్డ ప్రకటించారు. ఆ మేరకు ఓ పత్రికా ప్రకటన...

ఆ వైసీపీ ఎమ్మెల్సీలపై వేటు ఖాయమా?

కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఒకరిపై విమర్శలు, ఆరోపణలు షరా మామూలుగానే...

మహేష్ హీరోయిన్ విషయంలో వెనక్కి తగ్గారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న 27వ చిత్ర వివరాలు ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వెల్లడయ్యాయి. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సర్కారు వారి పాట అనే...

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్ లో మాట్లాడారు. టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలంటున్నారని...

కరోనా కలకలంతో ఏపీ సచివాలయంలో భయాందోళన.!

ప్రస్తుతం మంగళగిరి ఏపీ సచివాలయంలో కరోనా కలకాలంతో భయాందోళనలో అధికారులు. మంగళగిరి మండలం నవులూరు గోలివారితోట లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ, ఏపీ సచివాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్...