Ram Charan: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ఇటివలే తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామ్ చరణ్.. ‘తెలంగాణ రాష్ట నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. మీ సారధ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాన‘ని అన్నారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. రామ్ చరణ్ అభిమానులు కూడా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధిపథంలో నడవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
Heartiest congratulations to Chief Minister Sri @revanth_anumula Garu on your swearing-in. 💐
May your leadership bring about positive changes and prosperity for #Telangana State.
— Ram Charan (@AlwaysRamCharan) December 9, 2023