Janasena: సేవ, సాయం చేయడంలో జనసైన నేతలు, జనసైనికులు ఎప్పుడూ ముందే ఉంటారని మాజీ స్పీకర్, అవనిగడ్డ నియోజకవర్గ జనసేన (Janasena) ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటివల అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన వారిని ఆదుకుని మరోసారి తమ ఉదారతను చాటుకున్నారని ప్రశంసించారు. వివరాల్లోకి వెళ్తే..
ఇటీవలి ఎన్నికల నేపథ్యంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో కొందరు బాణాసంచా కాల్చారు. ప్రమాదవశాత్తూ యాసం వెంకటేశ్వరరావు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ సందర్భంగా వారిని ఆదుకోవడానికి ఎన్ఆర్ఐ జనసైనికులు 1లక్ష రూపాయల చెక్కును అందించారు. దీనిని బుద్ధప్రసాద్ భాదితులకు అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ..
జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పూర్తితో జనసైనికులు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అభినందనీయం. సేవా స్ఫూర్తితో అవనిగడ్డలో ఆపదలో ఉన్నవారికి ఇతర దేశాల్లో ఉండి కూడా ఎన్ఆర్ఐ జనసేనికులు సేవా ధృక్పథం చాటుకోవడం ఎందరికో స్ఫర్తినిచ్చే అంశం. వారందరికీ నా అభినందనల’ని అన్నారు. కార్యక్రమంలో జనసేన ఎన్ఆర్ఐ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Hi! I’ve been following your website for a long time now and finally got the bravery to
go ahead and give you a shout out from Huffman Tx! Just wanted to mention keep up the excellent job!