Pawan Kalyan: అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించారు. ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసి జనసేనకు అండగా నిలిచినందుకు స్వామినాయుడు పని తీరును మెచ్చుకుంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలయజేస్తున్నా. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిగారి అభిమాన సంఘంగా మొదలై సమాజ సేవలో నిరంతరం భాగమవుతూ వస్తున్నారు. ఇప్పుడు సమాజ సేవలో కూడా నిరంతరం భాగమవుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం మద్దతివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యావాదాలు తెలియజేస్తున్నా’నని అన్నారు.
పిఠాపురంలో పవన్ విజయం కోసం రవణం స్వామినాయుడు, ఎక్కువ సంఖ్యలో చిరంజీవి అభిమానులు అనేక రోజులు ప్రజల్లో నిలిచి ప్రచారం చేశారు. వీరి సేవలు గుర్తించే పవన్ కల్యాణ్ అభినందించారు.