Karthikeya: హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya) నటించిన కొత్త సినిమా ‘భజే వాయు వేగం’ (Bhaje vayu vegam). ఐశ్వర్య మీనన్ హీరోయిన్. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాను ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి సహ నిర్మాతగా తెరకెక్కిన సినిమా వేసవి సందర్భంగా మే31వ తేదీన విడుదల కాబోతోంది. ఇటివలే మెగాస్టార్ చిరంజీవి టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో సినిమా తెరకెక్కిందని చిత్ర యూనిట్ తెలిపింది. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తమ ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేస్తున్నారు. ఇటివలి సూపర్ హిట్ మూవీస్.. ‘బేబి’, ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘గామి’, ‘ఓం భీమ్ బుష్’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలను పంపిణీ చేశారు. యూవీ టీమ్ లో జాయిన్ కావడం సంతోషంగా ఉందని ధీరజ్ అన్నారు.