TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇటివలే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) , మరో 11మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వీరందరికీ శాఖలు కేటాయించారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ, వేణుగోపాల్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు.
మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..
భట్టి విక్రమార్క – ఆర్ధిక, ఇంధన శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటిపారుదల, పౌరసరఫరాలు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి – ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమం
తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయం, చేనేత
దామోదర రాజనర్సింహ – వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్, పర్యాటకం
పొంగులేటి శ్రీనివాస రెడ్డి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
సీతక్క – పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమ
కొండా సురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
హోం, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలతోపాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు సీఎం వద్దే ఉన్నాయి.