Switch to English

Ram Charan Birthday Special: రామ్ చరణ్ వన్ మ్యాన్ షో.. రెండో సినిమాకే రికార్డులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

Ram Charan: చిరంజీవి (Chiranjeevi) వారసుడు అంటే చిరంజీవి పేరు నిలబెట్టాలంతే..! వేరే ఆప్షన్ లేదు. అప్పటికి 28ఏళ్లుగా తెలుగు సినిమాపై చిరంజీవి వేసిన బలమైన ముద్ర.. సృష్టించిన ప్రభంజనం అటువంటిది. చిరంజీవి కుమారుడిగా వచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇక మెల్లగా కుదురుకుంటాడు.. అనే అవకాశమే ఎవరికీ ఇవ్వలేదు. ‘చిరు’తనయుడు చాన్స్ తీసుకోలేదు. తొలి సినిమాతోనే రఫ్పాడేసి రెండో సినిమాతో ఏకంగా దక్షిణాది సినిమాకే చుక్కలు చూపించాడు. భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు. అదే ‘మగధీర’. అభిమానుల ఆశలు.. ప్రేక్షకుల అంచనాల్లో అణువంత తేడా రానివ్వకుండా వన్ మ్యాన్ షో చేసేశాడు.. స్టార్ హీరో అయిపోయాడు.

అసలైన పాన్ ఇండియా మూవీ..

ఇప్పుడు చెప్పుకుంటున్న పాన్ ఇండియా సినిమా అసలు చెప్పుకోవాల్సిందే మగధీరతో. ఆ స్థాయి కంటెంట్ ఉన్న సినిమా. అప్పటి టెక్నాలజీకి తోడు.. రామ్ చరణ్ యాక్టింగ్.. హార్స్ రైడింగ్ స్కిల్స్.. సైన్యాధ్యక్షుడిగా ఆయన ఆహార్యం ఇవన్నీ తెలుగు ప్రేక్షకుల్ని తెర వైపు నుంచి చూపు తిప్పుకోనివ్వలేదు. అభిమానులైతే.. బాబోయ్.. ఇదేం కిక్కురా బాబూ.. అని ఆనందంతో ఉక్కిరిబిక్కిరే అయిపోయారు. ఫస్టాఫ్ లో స్టైలిష్ చరణ్.. పక్కింటి కుర్రాడిలా చలాకీతనం. సెకండాఫ్ వేటాడే చిరుతే అయ్యాడు. చిరంజీవి కొడుకు అంటే ఏంటో.. ఆ బ్రాండ్ కి ఉన్న విలువేంటో రొమ్ములు విరుచుకుని.. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాడని చెప్పడం చిన్నమాట. దర్శకుడు రాజమౌళి విజన్ కి తగ్గట్టు పెర్ఫార్మెన్స్ ఇచ్చి.. భవిష్యత్తులో ఓ స్టార్ కొడుకు ఎలాంటి ప్రభంజనం సృష్టించాలనేందుకు ల్యాండ్ మార్క్ పెట్టేశాడు రామ్ చరణ్.

దక్షిణాది సినిమాకే చుక్కలు..

నిజానికి తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్న చరణ్.. మగధీరతో చిరంజీవే ఉక్కిరిబిక్కిరయ్యే పుత్రోత్సాహాన్ని ఇచ్చేశాడు. ఆ తర్వాత నుంచి జరుగుతున్నది చిరంజీవికి బోనస్సే. రామ్ చరణ్ కు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్, గ్లోబల్ స్టార్ క్రేజ్ నిజానికి మగధీరతోనే వచ్చేంత కేపబిలిటీ ఉంది. అంతటి రోరింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమాతోపాటు దక్షిణాదిలో మరే భాషా సినిమా కూడా చూడని లాభాలు ఒక్క తెలుగు వెర్షన్ తోనే ట్రిపుల్ మార్జిన్ లాభాలు ఆర్జించింది మగధీర. 5వ వారం తర్వాత హైదరాబాద్ లో 35 ధియేటర్లు పెంచారంటే సినిమా ప్రభంజనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అదీ చిరంజీవి కొడుకంటే.. అదీ మెగా రేంజ్, తెలుగు సినిమా స్థాయి ఇదీ, టాలీవుడ్ కి మరో స్టార్ దొరికేశాడంతే అని అనిపించేశాడు రామ్ చరణ్.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....