Switch to English

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. దీంతో ఆయన కుటుంబం నుంచి వచ్చే హీరోలపై అదేస్థాయి అంచనాలు ఉండటం సహజం. రామ్ చరణ్ కూ తప్పలేదు. డెబ్యూ మూవీగా కాలేజీ, ప్రేమకు భిన్నంగా మాస్ మూవీ చేసి ప్రేక్షకులను తనపై ఓ అంచనాకు రప్పించేశారు. అయితే.. పూర్తి మాస్ జోనర్లోనే వెళ్లేందుకు చరణ్ ఇష్టపడలేదు. కథ, నటనకు పూర్తి ప్రాధాన్యం ఇస్తూ కల్ట్ మూవీస్ కూడా చేశాడు. ఆకోవలో వచ్చిందే ఆరెంజ్. 2010లో ఫ్లాప్ అయితే 2023లో సూపర్ హిట్టయి రామ్ చరణ్ స్క్రిప్ట్ సెలక్షన్ ఏంటో నిరూపించింది.

ఈక్రమంలో తమ ఆస్థాన ఇమేజ్ అయిన మాస్ నూ వదల్లేదు. రచ్చ, నాయక్, ఎవడు, బ్రూస్ లీ, వినయ విధేయ రామ వంటి సినిమాలు చేశారు. కథను నమ్మి రంగస్థలం చేశారు. సినిమాలో చెవిటి పాత్రను సవాల్ గా తీసుకున్నారు. సరైన సినిమా పడితే రామ్ చరణ్ రేంజ్ తెలుస్తుందని సుకుమార్ చెప్పిన మాటను నిజం చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసుకున్నాడు. చరణ్ కెరీర్ ను రంగస్థలంకు ముందు.. తర్వాతగా మార్చేసిందీ సినిమా. చిరుతతో హీరో డెబ్యూ మూవీస్ ఎలా ఉండాలి, మగధీరతో హై బడ్జెట్ సినిమాలు చేయొచ్చని, రంగస్థలంతో తమిళంలో ఎక్కువగా వచ్చే రస్టిక్ మూవీస్ తెలుగులోనూ తీయోచ్చని నిరూపించాడు. ధృవ సినిమాతో యాక్షన్ కథను అద్భుతంగా రక్తి కట్టించాడు. ఆర్ఆర్ఆర్ లో భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలో రామ్ చరణ్ తన నటనతో అబ్బురపరిచాడు.

కథల ఎంపికలో ఫ్యాన్స్ ఉద్దేశాల్ని కాకుండా వారిని మెప్పించేలా కథలు ఎంపిక చేస్తానని చెప్పి తన ఐడియాలజీని చెప్పాడు. కేవలం కథల ఎంపిక, సినిమాలు మాత్రమే కాదు.. కలెక్షన్లు, సెంటర్లు వంటి అంశాల్లోనూ తనదైన మార్క్ సెట్ చేశాడు. నిజానికి రంగస్థలం సృష్టించిన ప్రభంజనానికి పోస్టర్స్ లో వారం వారం కలెక్షన్లు.. 100 రోజుల సెంటర్లు దర్జాగా వేసుకోవచ్చు. కానీ.. తనకు అవేమీ ఇష్టం ఉండదని నాడే ఫుల్ స్టాప్ పెట్టించాడు. ఫ్యాన్ వార్స్ కి దూరంగా అభిమానుల్ని ఉంచాలనే ఉద్దేశం ఇది. రాజమౌళి చెప్పినట్టు క్లీన్ స్లేట్ గా సెట్ కు వెళ్లే రామ్ చరణ్ తన పాత్రకి తనదైన నటనతో సరికొత్త అధ్యాయాన్నే లిఖిస్తున్నాడు. అందుకే మెగా సామ్రాజ్యంలో రామ్ చరణ్ సమ్ థింగ్ స్పెషల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...