Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేస్తున్న సినిమాల వివరాలు తెలియజేశారు.
‘ప్రస్తుతం నేను వరుసగా సినిమాలు చేస్తున్నాను. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇండియన్ 3 కూడా సిద్ధమవుతోంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా నా పార్ట్ పూర్తయింది. మణిరత్నంతో చేస్తున్న థగ్ లైఫ్ ప్రస్తుతానికి షూటింగ్ విరామం ఇచ్చాం. ఎన్నికల తర్వాత సినిమా షూటింగ్ మొదలవుతోంది. ప్రభాస్ తో చేస్తున్న కల్కి సినిమాలో అతిధిపాత్రలో నటిస్తున్నా’నని తెలిపారు.
2022లో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా కమల్ హాసన్ కు మంచి విజయాన్ని అందించింది. దీంతో ప్రస్తుతం ఆయన నుంచి రానున్న సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.