బొట్టు, గోరింటాకు పెట్టుకుని వస్తున్నారని జరిమానాలు విధిస్తోంది ఓ ప్రిన్సిపల్. కర్నూల్ జిల్లా డిఎంహెచ్వో కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ గా 30 మంది విద్యార్థినులు శిక్షణ తీసుకుంటున్నారు. వారికి అక్కడే వసతి సౌకర్యం కూడా ఉంది.
ఈ కోర్సుకు ప్రిన్సిపల్, వార్డెన్ గా విజయ సుశీల ఉంటుండగా వారిచేత వ్యక్తిగత సేవలు చేయించుకోవడంతో పాటు బొట్టు పెట్టుకున్నా, గోరింటాకు పెట్టుకున్నా ఆమె జరిమానాలు విధిస్తుండేది.
అంతే కాకుండా వేధింపులు కూడా ఎక్కువవడంతో విద్యార్థినులు అందరూ కలిసి ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ లక్ష్మి నర్సయ్య దృష్టికి తీసుకువెళ్లగా విజయ సుశీలను వసతి గృహంలో ఉండకూడదని వేరే ఇల్లు చూసుకోవాలని చెప్పారు.
అప్పటి నుండి విద్యార్థినులకు మరింతగా వేధింపులు పెరగడంతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పరిస్థితులు అదుపు తప్పేలా ఉండటంతో విద్యార్థినులకు సెలవులు ఇచ్చి ఇంటికి పంపేశారు.