కొన్నాళ్ళ క్రితం చిరంజీవి మీద.. అంటే, అది ప్రజారాజ్యం పార్టీ సమయంలో.! ఇప్పుడేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద.! అసలు ఈ ‘తిమ్మిరి’ దేనికి.? తమ్మారెడ్డి భరద్వాజ.. ప్రముఖ దర్శక నిర్మాత. కానీ, ఒకప్పుడు. ‘మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి’ అన్న చందాన తయారైంది తమ్మారెడ్డి భరద్వాజ వ్యవహారం.
విద్యార్థిగా వున్నప్పుడు విశాఖ స్టీలు ప్లాంటు కోసం ఉద్యమించారట.. మొన్నామధ్యన స్పెషల్ స్టేటస్ కోసం కూడా ఉద్యమించేశారట. సినీ పరిశ్రమలో ‘పెద్దన్న’ అనదగ్గ వయసు, అనుభవం వున్నా.. అవి దేనికీ ఉపయోగించరాయన. పరిశ్రమకి ఏదన్నా సమస్య వస్తే పెదవి విప్పరు. వయసు మీద పడింది కదా.. ఖాళీగా ఇంట్లో కూర్చుని యూ ట్యూబ్ వీడియోలతో కాలక్షేపం చేస్తున్నారు. వున్నపళంగా సినీ, రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తేశారు.
తప్పేముంది.? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాన్ని తెలిపే హక్కు వుంది. కానీ, అభిప్రాయం పేరుతో.. ఇతరుల మీద బురద చల్లడమే పనిగా పెట్టుకుంటేనే అసలు సమస్య. పదే పదే పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తుంటారు. చిరంజీవినీ తూలనాడుతంటారు.
‘మీరెవరికీ భయపడరు కదా.. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు వంచేసి ప్రత్యేక హోదా తెచ్చెయ్యండి..’ అంటూ తేలిగ్గా మాట్లాడేశారు తమ్మారెడ్డి భరద్వాజ్.. పవన్ కళ్యాణ్ మీద.
కేంద్రం మెడలు వంచాలంటే, చట్ట సభల్లో కాస్తో కూస్తో ప్రాతినిథ్యం వుండాలి.. ఆ ప్రాతినిథ్యం కల్పించాల్సింది ప్రజలన్న ఇంగిత జ్ఞానం తమ్మారెడ్డి భరద్వాజకి లేకుండా పోయింది. ఇప్పుడున్న రాజకీయాల్లో గెలుపోటములు ఎలాంటివో తమ్మారెడ్డికి తెలియదా.? డబ్బు పంచి ఓటర్లను కొని చట్ట సభలకు వెళ్ళాలనుకోలేదు పవన్ కళ్యాణ్. అదే సమస్య.
తాను సినిమాల్లో సంపాదించిన సంపాదన నుంచి, కౌలు రైతులకో.. ఇంకొకరికో.. కష్టాల్లో వున్నోళ్ళకి సాయం చేస్తున్నారు. కోట్లాది రూపాయల్ని ఇలా వెదజల్లుతున్నారు. ఓట్లను ఈ డబ్బుతో కొనుక్కోలేక కాదు.! అలా కొనుక్కుని వుంటే, చట్ట సభల్లో పవన్ కళ్యాణ్ వుండేవారే.
ప్రశ్నించాల్సింది ఎవర్ని.? అధికారంలో వున్నోళ్ళని. చిత్రంగా, అధికారంలో లేనోళ్ళు సరిగ్గా ప్రశ్నించడంలేదంటూ తమ్మారెడ్డి భరద్వాజ, పవన్ కళ్యాణ్‌ని నిలదీస్తున్నారు. బహుశా ఈయనికి కూడా ‘బులుగు పార్టీ విసిరే ఐదు రూపాయల పేటీఎం’ అవసరమైందేమో.! లేదంటే, ఏదన్నా ‘సామాజిక వర్గ జాడ్యం’ వుందేమో.!
వారాహి.. బౌన్సర్లు.. అంటూ తన మాటల్లో పిచ్చి ప్రేలాపన, ప్రస్తావన చేశారు తమ్మారెడ్డి. ఇదీ అసలు అక్కసు. జనంలోకి వెళ్ళి, జనాన్ని చైతన్య పరిచేందుకు మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఆ చైతన్యం నుంచి వచ్చే ప్రజా విజయం కోసం ఆయన పరితపిస్తున్నారు. తాను గెలవాలని కాదు, ప్రజలు గెలవాలన్నది పవన్ కళ్యాణ్ రాజకీయ ఆలోచన. అది అర్థం కావాలంటే తమ్మారెడ్డి భరద్వాజ లాంటోళ్ళు, కులం.. రాజకీయం.. ఇలాంటి పొరల్ని వదిలించుకుని.. స్వచ్ఛమైన కళ్ళతో చూడాల్సి వుంటుంది.