అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడు. ప్రపంచంకు పెద్దన్న పాత్రను పోషించే అమెరికా అధ్యక్షుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి ప్రాముఖ్యత ఉన్న అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన ఏ వస్తువు అయినా ఏ మనిషి అయినా కూడా చాలా ప్రత్యేకంగానే చూస్తారు. ఆయన ఏం చేసినా కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వారికి పెంపుడు జంతువులు ఉంటే అవి రాజ బోగాలు అనుభవించాల్సిందే. అమెరికా మొదటి అధ్యక్షుడి నుండి ఇప్పటి వరకు ఇద్దరు అధ్యక్షులు మాత్రమే పెంపుడు జంతువులు లేకుండా వైట్ హౌస్ లో అడుగు పెట్టారు. ట్రంప్ హయాంలో వైట్ హౌస్ లో పెంపుడు జంతువులు ఏమీ లేవు.
పాత అధ్యక్షులకు చిత్ర విచిత్రమైన పెంపుడు జంతువులు మరియు పక్షులు ఉండేవి. కొందరు పాత అధ్యక్షులు బల్లులు, గుడ్ల గూబలను కూడా పెంచుకునే వారు. కొందరు మొసలి ఇంకా ఎలుగు బంటి, ఎలుకలను కూడా పెంచుకునే వారు అంటూ అమెరికా వైట్ హౌస్ అధికారుల నుండి సమాచారం అందుతోంది.
మొదటి నుండి ఇప్పటి వరకు వైట్ హౌస్ లో అడుగు పెట్టిన పెంపుడు జంతువులు మరియు పక్షులు ఏంటీ అంటే.. కుక్క, పిల్లి, పులి, ఎలుగ బంటి, ఆవు, మేక, మొసలి, హైనా, పాము, కోళ్లు, గుర్రం, చిలుక, గుడ్లగూబ, బల్లి, పట్టు పురుగులు. ఇలా చిత్రంగా రకరకాలుగా పెంపుడు జంతువులను పెంచారు. తాజాగా అధ్యక్షుడు అయిన బైడెన్ కు రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి.
403977 981113Sweet website , super pattern , rattling clean and use friendly . 510816
486934 111426I like the valuable info you give inside your articles. Ill bookmark your weblog and check once again here regularly. Im quite certain Ill learn numerous new stuff right here! Good luck for the next! 891531