మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్‌ను తెలుగులో రీమేక్ చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. చిరంజీవి కీలక పాత్రలో నటించబోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా చిన్న పాత్రను పోషించబోతున్నాడు. ఈ చిత్రంకు సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ చేశాడంటూ ఆమద్య వార్తలు వచ్చాయి. తాజాగా సుకుమార్ దర్శకత్వంలోనే ఈ రీమేక్ తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంకు సుకుమార్ దర్శకుడు కాదట.
గీత గోవిందం చిత్రంతో దర్శకుడిగా మంచి ప్రశంసలు దక్కించుకున్న పరుశురామ్ ఆ వెంటనే మరో సినిమాను గీతాఆర్ట్స్‌లో చేసేందుకు అగ్రిమెంట్ చేశాడు. అందుకే ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌కు పరశురామ్‌ను తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈయన నాగచైతన్యతో ‘నాగేశ్వరరావు’ అనే సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఇదే ఏడాది చివరి వరకు నాగేశ్వరరావు సినిమాను పూర్తి చేయబోతున్నాడు.
మరో వైపు చిరంజీవి మరియు చరణ్‌లు కూడా వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. అన్ని ఓకే అయితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో లూసీఫర్ సినిమా పట్టాలెక్కబోతుంది. గీత గోవిందం చిత్రంతో సూపర్ హిట్ దక్కించుకున్న పరుశురామ్ లూసీఫర్ చిత్రాన్ని ఎలా రీమేక్ చేస్తాడో చూడాలి.