లవ్‌స్టోరీ : సాయి పల్లవి ముద్దుకు చైతూ ఏడ్చేశాడు

లవ్‌స్టోరీ : సాయి పల్లవి ముద్దుకు చైతూ ఏడ్చేశాడు

నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ స్టోరీ’. ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. నేడు వాలెంటైన్స్‌ డే సందర్బంగా ఓయ్‌ పిల్ల పాటకు సంబంధించిన మ్యూజికల్‌ థీమ్‌ వీడియో విడుదల అయ్యింది. ఆ వీడియోలో నాగచైతన్య మరియు సాయి పల్లవిల పాత్రలను పరిచయం చేశాడు. చాలా ఎమోషనల్‌ కుర్రాడి పాత్రలో నాగచైతన్య కనిపించగా ఫిదాలో మాదిరిగానే సాయి పల్లవి కాస్త స్పీడ్‌గా కనిపించింది.

ట్రైన్‌లో చైతూకు సాయి పల్లవి ముద్దు పెట్టడంతో చైతూ ఎమోషనల్‌ అవ్వడం, దాంతో ఏందీ ముద్దు పెడితే ఏడ్చేస్తారా అంటూ చెప్పిన డైలాగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. శేఖర్‌ కమ్ముల గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఫీల్‌ గుడ్‌ మూవీ అని, అలాగే మళ్లీ ఒక కమర్షియల్‌ హిట్‌ను కూడా శేఖర్‌ కమ్ముల అందుకోవడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫిదా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న శేకర్‌ కమ్ముల ఈ చిత్రాన్ని చాలా తక్కువ సమయంలో చాలా స్పీడ్‌గా పూర్తి చేశాడు. ఒక సింపుల్‌ స్టోరీని తనదైన స్టైల్‌లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించాడు. నాగచైతన్య ఈ చిత్రంలో కాస్త గడ్డం పెంచి కనిపించాడు. గడ్డంకు కారణం ఏమైనా ఉందా చూడాలి. ఈ చిత్రం సమ్మర్‌ ఆరంభంలోనే ప్రేక్షకులను పలకరించబోతుంది.