Switch to English

నయా సోషల్‌ పోకడ: ప్రశ్నిస్తే ‘గ్యాంగ్‌ రేప్‌’ చేసేస్తాం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

ఏదన్నా విషయమ్మీద సెలబ్రిటీలు స్పందిస్తే, ‘గ్యాంగ్‌ రేప్‌ చేసేస్తాం..’ అంటూ నెటిజన్లు కొందరు విరుచుకుపడటం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. కొన్నాళ్ళ క్రితం హీరోయిన్‌ మీరా చోప్రా విషయంలో ఇదే జరిగింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. అదీ ఓ తెలుగు హీరో అభిమానుల నుంచి ఆమెకు ఆ స్థాయిలో బెదిరింపులు వచ్చాయి.

తెలుగునాట అనసూయ భరద్వాజ్‌ తదితర సెలబ్రిటీలకు ఈ తరహా ‘రేప్‌’ బెదిరింపులు సోషల్‌ మీడియా వేదికగా ఎక్కువైపోయాయి. పోలీసులకు ఆయా సెలబ్రిటీలు ఫిర్యాదులు చేయడం, కేసులు నమోదైనా.. ఆయా కేసుల్లో నిందితులకు సరైన శిక్షలుపడకపోవడం.. ఈ పైత్యం మరింత పెరిగిపోయింది. హీరోయిన్ల నుంచి ఇప్పుడు హీరోలు, ఇతర సెలబ్రిటీల కుమార్తెలకూ ఈ తరహా బెదిరింపులు ఎక్కువైపోవడం గమనార్హం.

ఇటీవల క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ కుమార్తెపై గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడతామంటూ కొందరు నెటిజన్లు రెచ్చిపోయారు. కేసు నమోదయ్యింది.. ఈ కేసులో ఓ మైనర్‌ బాలుడ్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

తాజాగా, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కుమారెను రేప్‌ చేస్తామంటూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. శ్రీలంక క్రికెటర్‌ మురళీధరన్‌ బయోపిక్‌లో విజయ్‌ సేతుపతి నటిస్తుండడమే ఇందుకు కారణం. వివాదం ముదిరి పాకాన పడింది. మురళీధరన్‌ స్వయంగా విజయ్‌ సేతుపతిని అభ్యర్థించాడు, సినిమా చేయొద్దని. దాంతో విజయ్‌ సేతుపతి ఆ సినిమా నుంచి తప్పుకున్నా, ఆయన కుమార్తెకు మాత్రం సోషల్‌ మీడియా వేదికగా లైంగిక వేధింపులు తప్పడంలేదు.

ఈ మధ్య ఓ కామెడీ ప్రోగ్రాంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ని అనుకరించారన్న అరోపణలతో, ఆ కామెడీ ప్రోగ్రాంకి హోస్ట్‌గా వ్యవహరించిన నాగబాబు కుమార్తె నిహారికపైనా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు వైసీపీ మద్దతుదారులు కొందరు చేశారు. సోషల్‌ మీడియా అంటే ఎలాంటి వెర్రి రాతలైనా రాసుకోవచ్చా.? నారా లోకేష్‌ సతీమణినీ, వైఎస్‌ జగన్‌ సోదరినీ.. ఇలా ఎవర్నీ వదలట్లేదు.

ఆయా పార్టీలు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయని అనలేం. ఆయా హీరోల అభిమానులూ, ఇలాంటివి ప్రోత్సహిస్తారని అనడం సబబు కాదు. పార్టీల ముసుగులోనో, ఆయా సెలబ్రిటీల అభిమానుల ముసుగులోనో ఈ తరహా ‘రేప్‌’ వార్నింగ్‌లు సోషల్‌ మీడియా వేదికగా ఇవ్వడం అత్యంత జుగుప్సాకరం. ఇలాంటి వాటిపై పోలీసులు చర్యలు తీసుకోవడం సంగతెలా వున్నా, ఇలాంటివాటిని ఆయా సోషల్‌ మీడియా సంస్థలు ‘సెన్సార్‌’ చేయడం మంచిదేమో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో వైరల్

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే పండగే. ఎన్ని పనులున్నా ఆగిపోతాం. అయితే.....

నేడు ఏపీ లో తేలికపాటి వర్షాలు

బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏపీ తీరానికి దూరంగా ఈశాన్య దిశగా పయనిస్తూ గురువారం...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...