పంచాంగం
తేదీ 26- 05-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు.
సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు
తిథి: బహుళ తదియ సా.5.48 వరకు తదుపరి చవితి
నక్షత్రం: మూల ఉ.10.47 వరకు తదుపరి పూర్వాషాఢ
దుర్ముహూర్తం: సాయంత్రం. 4.25 నుంచి 5.13 వరకు
శుభ సమయం: ఉదయం 11:00 నుంచి 12.00 వరకు
రాహుకాలం: ఉ 4.30 నుంచి 06:00 వరకు
యమగండం: మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు
ఈరోజు (26-05-2024) రాశి ఫలితాలు
మేష రాశి: పనిచేసే ప్రదేశాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిమీద ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.
వృషభ రాశి: ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత అవసరం. అనవసర ఖర్చుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఇంటి పెద్దలను సంప్రదించడం మంచిది. భవిష్యత్తును నిర్దేశించే పనులను వాయిదా వేయడం ఉత్తమం.
మిథున రాశి: అనుకూల సమయం. తోబుట్టువులు సహకారం అందుతుంది స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగంలోకి మారాలనుకునే వారికి మంచి సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి: మిశ్రమ కాలం. పనిచేసే ప్రదేశాల్లో సహోద్యోగుల మద్దతు అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం.
సింహరాశి: ముఖ్యమైన పనులు వాయిదా వేయకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కష్టానికి తగిన గుర్తింపు లభించక పోవడం వల్ల నిరుత్సాహం చెందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల గుర్తింపు లభిస్తుంది.
కన్యారాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ వర్గాల వారికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. పెద్దల సలహా తీసుకుని పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.
తులారాశి: అదృష్ట కాలం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారు శుభవార్తలు వింటారు. పాత స్నేహితులని కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత అవసరం.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశి వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్లో సహనంగా ఉండటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు.
ధనస్సు రాశి: పనుల్లో విజయం సాధిస్తారు. బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడికి గురవుతారు. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కొత్త వ్యక్తులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. సహోద్యోగులతో సత్సంబంధాలు అవసరం.
మకర రాశి: ముఖ్యమైన పనుల్లో ఇతరుల జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. మృదువుగా మాట్లాడటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు.
కుంభరాశి: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన అవకాశాలను అందుకుంటారు. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుతాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
మీన రాశి: అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు సమస్యలు తెచ్చి పెడతాయి.