Bark Air: పెంపుడు కుక్కలను ప్రజా రవాణా వ్యవస్థలో తీసుకెళ్లనివ్వని సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి కోసమే 15కుక్కలు.. వాటితో ఒక్కో వ్యక్తి ప్రయాణించేలా ప్రత్యేక విమానం నడుపుతోంది ‘బార్క్ ఎయిర్’ (Bark Air) సంస్థ. తొలి విమానాన్ని న్యూయార్క్ నుంచి లాస్ ఏంజిల్స్ వరకూ నడిపింది. టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం.
కుక్కలకు ఆహారం, బొమ్మలు తయారే చేసే బార్క్ సంస్థ ఓ విమానయాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. విమానంలో కుక్కలకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో కుక్కలు కంగారుపడకుండా స్నాక్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణంలో బిస్కట్లు, చాక్లెట్స్, ఇతర ఆహారం, ఆట బొమ్మలు, ప్రత్యేక క్యాబిన్లు, మ్యూజిక్, సెంట్, టాయిలెట్ బ్యాగ్స్ సదుపాయాలు కల్పించారు.
ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. క్యూలైన్లు ఉండవు 10టికెట్లే విక్రయిస్తారు. టీకాలు వేయిస్తూండాలి. రేబిస్ ఉన్న ప్రాంతాల్లో ఉండకూడదు. న్యూయార్క్-లాస్ ఏంజిల్స్ ప్రస్తుత టికెట్ ధర 6వేల డాలర్లు (దాదాపు 5లక్షలు), లండన్ కు 8వేల డాలర్లు (దాదాపు 7లక్షలు)గా నిర్ణయించారు.