Switch to English

జగనన్నా లిక్కర్‌ షాప్‌కి వెళితే ‘కరీనా’ వస్తుందా.?

ఓ మైనార్టీ సోదరుడు సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ వీడియో సందేశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అందర్నీ ఈ వీడియో ఆలోచింపజేస్తోంది. పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులు, మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేసుకోలేని పరిస్థితి. క్రిస్టియన్లు చర్చికి వెళ్ళలేరు.. హిందువులు దేవాలయలకు వెళ్ళలేరు. ఎందుకంటే లాక్‌డౌన్‌ నేపథ్యంలో, మతపరమైన కార్యక్రమాల పట్ల కరినతరమైన ఆంక్షలున్నాయి.

మంచిదే, మర్కజ్‌ అనుభవాల నేపథ్యంలో ఏ మతానికి చెందినవారైనా సరే, తమ తమ ప్రార్థనా స్థలాల వద్ద జనం గుమికూడే అవకాశం వుంటుంది గనుక.. వాటిని కొన్నాళ్ళ పాటు బంద్‌ చేయడమే మంచిదన్న అభిప్రాయంతో వున్నారు. కానీ, లిక్కర్‌ షాపుల్ని తెరవడంలో ఆంతర్యమేంటి.? ఇదే, పైన చెప్పుకున్న మైనార్టీ సోదరుడు సంధించిన ప్రశ్న కూడా. ‘మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేయకూడదా.? కరోనా వైరస్‌ వస్తుందా.? మరి, లిక్కర్‌ షాపుకి వెళితే కరోనా రాదా.? కరోనాకి బదులుగా కరీనా కపూర్‌ వస్తుందా.?’ అని ప్రశ్నించాడు ఆ మైనార్టీ సోదరుడు. అతనొక్కడి ఆవేదనే కాదు ఇది.

ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది ఇదే ప్రశ్నిస్తున్నారు. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, ప్రజల అభిప్రాయాలతో ప్రభుత్వాలకి సంబంధం లేదు. ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాల్ని ప్రోత్సహిస్తున్నాయి ప్రభుత్వాలు నిస్సిగ్గుగా.

ఏమన్నా అంటే, ధర పెంచితే మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుందన్న చెత్త లాజిక్‌ ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ తెరపైకి తెస్తోంది. తొలి రోజు రికార్డు స్థాయి అమ్మకాలు.. రెండో రోజూ అదే పరిస్థితి. తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో లిక్కర్‌ కోసం జనం ఎగబడ్తున్న వైనం చూసి, ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. ఈ మాత్రందానికి నలభై రోజులకు పైగా జనం లాక్‌డౌన్‌ని ఎందుకు భరించినట్లు.? అలా భరించడం వల్ల ప్రజలకు ఒరిగిందేమిటి.?

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: బాలికపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియుడి దారుణం

దేశం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మహిళలపై మృగాళ్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో దిశ చట్టం అమలులో ఉన్నా కొందరు కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

ఏపీలో మొదటి రోజే వరుస కేసులతో చంద్రబాబుకి షాక్.!

లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ లో ఉండడంతో లాక్ డౌన్ కాలమంతా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 60 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం...

6 ఏళ్ల ‘మనం’ జర్నీలో ఆసక్తికర విషయాలు కొన్ని.!

తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వంశానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలియంది కాదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున దిగ్విజయంగా కొనసాగిస్తే.. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ తో...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...