Switch to English

మీడియా ‘ఇన్‌’సైట్‌: ‘లాక్‌డౌన్‌’ ముసుగులో లాక్‌ ఔట్‌!

తెలుగు మీడియా రంగంలో ‘లాక్‌ డౌన్‌’ ముసుగులో ‘లాక్‌ ఔట్‌’ చర్యలకు సంస్థల యాజమాన్యాలు యత్నిస్తున్నాయా.? ‘నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌’ ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి రాసిన లేఖలో, మీడియా రంగంలో ప్రస్తుత పోకడల్ని ప్రస్తావించింది.

నిజానికి మీడియా సంస్థలంటే నెల రోజులకో, రెండు నెలలకో సరిపడా మాత్రమే నిధుల్ని వుంచుకుని, నడిపే సంస్థలు కావు. పదేళ్ళు, పాతికేళ్ళు.. అంతకు మించి సుదీర్ఘ కాలం పనిచేసేలా ప్రణాళికలతో మీడియా సంస్థలు ఏర్పడతాయి.

ఇప్పుడంటే మీడియా ఓ వ్యాపారంగా మారిపోయిందిగానీ, ఒకప్పుడు మీడియా ఆలోచనలు వేరు. కాలక్రమంలో మీడియాలో వచ్చిన మార్పుల్ని తప్పు పట్టలేం. కానీ, కేవలం నెలన్నర లాక్‌డౌన్‌కే మీడియా సంస్థలు, తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడమేంటి.? ఎక్కడో తప్పు జరుగుతోందని చిన్న పిల్లాడినడిగినా చెప్పేస్తాడు. ఇదే విషయాన్ని ‘నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌’ కుండబద్దలుగొట్టేస్తోంది.

లాక్‌డౌన్‌ ముసుగులో టాబ్లాయిడ్స్‌, స్పెషల్‌ ఎడిషన్స్‌ని తగ్గించేశారు. ఆ ఎడిషన్లు తగ్గాయి గనుక, ఉద్యోగుల్ని ఇంటి ముఖం పట్టించేస్తున్నారు. సాధారణంగా అనుభవంతోనే జీతం పెరుగుతుంది. ఇప్పుడేమో, అనుభవజ్ఞుక్షల్ని తప్పించేయడానికి ‘లాక్‌డౌన్‌’ని వాడేసుకుని, తక్కువ జీతానికి పనిచేసేవాళ్ళని కొత్తగా నియమించుకునే ప్రక్రియ మొదలు పెడుతున్నాయి ఆయా మీడియా సంస్థలు.

ఇదిలా వుంటే, మీడియాకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుంటాయి. మరోపక్క, ప్రభుత్వ ప్రకటనల ద్వారా లభించే ఆదాయం సంగతి సరే సరి. ఇన్ని సానుకూలతలున్నా, కొన్ని ఇబ్బందులూ మీడియాకి వుంటే వుండొచ్చుగాక. కానీ, దీర్ఘకాల ప్రణాళికలతో మీడియా సంస్థలు స్థాపించి, ఈ కుటిల రాజకీయాలు చేయడమేంటి.? అన్నదే అసలు ప్రశ్న.

ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా పలు ప్రధాన మీడియా సంస్థల్లోని బాగోతాల్ని ‘నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌’ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం గమనార్హం. మరి, ప్రభుత్వ పరంగా, బాధిత జర్నలిస్టులకు ఉపశమనం లభిస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

కరోనా కష్ట కాలంలో వైసీపీ సంబరాలు సమంజసమా.?

కరోనా వైరస్‌ ముప్పు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘ఏడాది పాలన’ సంబరాలకు సమాయత్తమవుతోంది. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు సంబరాల కోసం అటు ప్రభుత్వం...

ఆర్ఆర్ఆర్ కు చిక్కుల మీద చిక్కులు

రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ ఏడాదిన్నర నుండి సాగుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసారు. లాక్  డౌన్ లేకపోయి...

క్రైమ్ న్యూస్: కాటికెళ్లే వయసులో బాలికపై అత్యాచారం.!

బాలికలపై అత్యాచారాలను అరికట్టాలని ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఇంకా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటువంటి ఓ దురాగతం సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పంచాయితీలోని కిష్టయ్యపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో కుటుంబంతో కలిసి...

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...

మరో శిష్యుడికి అవకాశం ఇవ్వనున్న సుక్కూ

దర్శకులు తమ దగ్గర పనిచేసే శిష్యులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించడం అనేది సాధారణమే. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దగ్గర చేరిన బ్యాచ్ లో ప్రతిఒక్కరూ దర్శకునిగా తమదైన ముద్ర వేసుకున్నారు. కృష్ణ వంశీ,...