Switch to English

ప్రత్యేక హోదా ‘మచ్చ’ చెరిపేసుకోనున్న మోడీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

రెండోసారీ బంపర్‌ మెజార్టీతో కేంద్రంలో అధికారం దక్కించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో కొంత సానుకూలంగా కనిపిస్తున్నారా? అనే ప్రశ్నకు ఔననే సమాధానమిస్తున్నాయి ఢిల్లీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పుంజుకోవాలంటే, ఖచ్చితంగా ప్రత్యేక హోదా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నది ఆ పార్టీ అధిష్టానం ఇటీవల జరిపిన సమీక్షల్లో తేలిన సారాంశమట.

ఐదేళ్ళు ప్రత్యేక హోదా అంశాన్ని పాతరేసిన బీజేపీ, ఇప్పుడెలా ఆ అంశాన్ని బయటకు తీసుకురాగలదు? అనే అనుమానం ఓ వైపు వున్నా, ఆంధ్రప్రదేశ్‌లో ఎదగాలంటే భారతీయ జనతా పార్టీకి ఇంకో ఆప్షన్‌ లేదనే వాదన కూడా గట్టిగా విన్పిస్తోంది. ‘ఐదేళ్ళు బీజేపీని ఆంధ్రప్రదేశ్‌లో చాలా కష్టంగా మోశాం, ఇకపై మోయడం కష్టం..’ అనే అభిప్రాయాన్ని ఏపీ బీజేపీ నేతలు, నరేంద్ర మోడీ ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన వద్దనే వెలిబుచ్చినట్లు తెలుస్తోంది.

అయితే, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్‌ వైఎస్సార్సీపీకి దక్కుతుందేమో? అన్న అనుమానం నరేంద్రమోడీ నుంచి వ్యక్తమయ్యిందట. మోడీ చెప్పిన ఆ మాటపై సమాధానం చెప్పేందుకు ఏపీ బీజేపీ నేతలెవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. ‘ప్రత్యేక హోదా దండగ’ అని మనమే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ అదే దిశగా అడుగులు వేస్తే ఉపయోగం వుండకపోవచ్చని సాక్షాత్తూ ఏపీ బీజేపీకి చెందిన ఓ ముఖ్య నేత తన అభిప్రాయాన్ని నరేంద్ర మోడీ వద్ద కుండబద్దలుగొట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఆ అభిప్రాయంతో మెజార్టీ బీజేపీ నేతలు వ్యతిరేకించారట కూడా.

దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉనికిని కాపాడుకున్నా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉనికిని కోల్పోయామన్న భావన ప్రధాని నరేంద్ర మోడీలో స్పష్టంగా వుంది. అందుకే, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు మోడీ, ఒకింత మెట్టు దిగే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యేక హోదా సంగతెలా వున్నా, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌ వంటి విషయాల్లో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవడం మంచిదనే ఆలోచనతో ఆయన వున్నారట.

ప్రత్యేక హోదాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పక్షం ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకుంటే ఎలా వుంటుంది.? అన్నదానిపై అత్యంత సన్నిహితులతో మోడీ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ళలో మోడీ, ఏపీ విషయంలో వ్యవహరించిన తీరు ఎలా వున్నా, ఇకపై బీజేపీ ఆలోచనల్లోనూ.. మోడీ ఆలోచనల్లోనూ మార్పు కనిపిస్తుందంటున్న అంచనాలే నిజమైతే, ఆంధ్రప్రదేశ్‌కి మహర్దశ పట్టనుండడం ఖాయమే.

Related Posts

జగన్‌కి వ్యతిరేకంగా ‘స్కెచ్‌’ రెడీ చేస్తున్న మోడీ

మోడీకి వంగి వంగి దండాలెట్టాలా వైఎస్‌ జగనూ!

చంద్రబాబుని తిడితే లాభమేంటి మోడీజీ!

సీఎం జగన్‌కి తొలి షాక్‌: బాబు, మోడీ ఒక్కటయ్యారా?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...