Switch to English

టీడీపీలో పెద్దోడితో చిన్నోడి ‘కమ్మ’ని ఫైట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రధానంగా విజయవాడ ఎంపీ కేశినేని నానికీ, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకీ అస్సలేమాత్రం పొసగడంలేదు. అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ ఫలితాలు పలించడంలేదాయె. అంతలా ఇద్దరి మధ్యా విభేదాలెందుకు ముదిరి పాకాన పడుతున్నాయి.? అంటే, ఈ ప్రశ్నకు టీడీపీ వర్గాల నుంచే ఆసక్తికరమైన ‘లీక్‌’ ఒకటి బయటకు వస్తోంది.

కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావు.. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఆ సంగతి అందరికీ తెల్సిందే. మరి ‘కమ్మ’గా కలిసిపోక, ఈ యుద్ధమెందుకు.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అయితే, ‘కమ్మ’టి ఈక్వేషన్‌లో మరో రెండు కోణాలున్నాయనీ, కేశినేని నాని ‘పవర్‌’ పరంగా, తన సొంత సామాజిక వర్గంలో ఇమేజ్‌ పరంగా తాను ‘పెద్ద’ అన్న భావనతో వుంటే, దేవినేని ఉమని ఆ రెండు విభాగాల్లోనూ ‘చిన్న’ అనే దృష్టితో చూస్తున్నారట. సో, చిన్నోడు ఇచ్చే ఉచిత సలహాలు పెద్దోడికి కోపం తెప్పిస్తున్నాయన్నమాట.

దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా వున్నప్పుడూ సొంత సామాజిక వర్గంలో ‘చిన్న – పెద్ద’ అన్న తేడాల కారణంగా కేశినేని అసహనానికి గురయ్యారనీ, అయితే అప్పట్లో కీలకమైన మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న దరిమిలా, దేవినేని ఉమామహేశ్వరరావు ఓవరాక్షన్‌ని కేశినేని నాని ఉపేక్షించక తప్పలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ టీడీపీ నేత స్వయంగా మీడియాకి లీకులు అందిస్తుండడం గమనార్హం.

ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి ఏమంత బాగా లేదు. ఓటమి పాలయ్యాక ఆయన గురించి పట్టించుకుంటున్నవారే కరవయ్యారు. పైగా, ప్రాజెక్టుల్లో అవినీతిని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బయటకు తీస్తే, దేవినేని అడ్డంగా బుక్కయిపోవడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా వుంటే, 2014 ఎన్నికల సమయంలో దేవినేని ఉమ గెలుపు కోసం కేశినేని నాని ‘ఆర్థికంగా’ సహకరించగా, తాజా ఎన్నికల్లో కేశినేని నానిని ఓడించేందుకు దేవినేని ఉమ తీవ్రంగా శ్రమించారనీ, ఈ విశ్వాస ఘాతుకాన్ని నాని అస్సలు తట్టుకోలేకపోతున్నారని నాని సన్నిహితులు చెబుతున్నారు.

కమ్మ సామాజిక వర్గంలో ‘చిన్న – పెద్ద’ అనే తేడాలు, వాటికి మించిన ‘ఇగో క్లాషెస్‌’, వీటన్నిటికీ తోడు ఇతరత్రా అనేక సమీకరణాలు వెరసి.. కేశినేని నాని, దేవినేని ఉమ రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్న కేశినేని నాని, బీజేపీలో చేరడం ఖాయమైతే, ఆ తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావుకి మరిన్ని షాక్‌లు తప్పవన్నది బెజవాడ రాజకీయాల్లో జరుగుతోన్న ఆసక్తికరమైన చర్చ తాలూకు సారాంశం.

Related Posts

కొడాలి నాని పంచన చేరనున్న దేవినేని ఉమ!

‘కులం’ పోటు: బాబుని వదిలి ‘కమ్మ’గా బీజేపీలోకి!

కేశినేని బానిస సంకెళ్లు పోయేనా?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...