Switch to English

మోడీకి వంగి వంగి దండాలెట్టాలా వైఎస్‌ జగనూ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

వయసులో చాలా పెద్ద వ్యక్తి గనుక దేశ ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ‘నమస్కారం’ చేయడంలో తప్పు లేదు. మామూలు నమస్కారం కాదు, సాష్టాంగ పడి కూడా నమస్కారం చేయొచ్చు. కాళ్ళు పట్టుకుని దండం పెట్టినా తప్పు లేదు. కానీ, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా సాదా సీదా వ్యక్తి కాదిప్పుడు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, నరేంద్ర మోడీ పాదాలకు నమస్కరించే యత్నం చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఎందుకంటే, నరేంద్ర మోడీ పాలనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం ముక్త కంఠంతో తిరస్కరించింది. భారతీయ జనతా పార్టీకి ఒక్క అసెంబ్లీ సీటుగానీ, ఒక్క పార్లమెంటు సీటుగానీ తాజా ఎన్నికల్లో దక్కలేదు. ఓటు బ్యాంకు కూడా గతంతో పోల్చితే దారుణంగా పడిపోయింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని వంచించింది మరి. నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారంటూ గతంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు కూడా. ఆ కారణంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గతంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశ పెట్టింది పార్లమెంటు సాక్షిగా. కానీ, ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఎదుటపడ్డారో వైఎస్‌ జగన్‌ తన ‘స్వామి భక్తి’ ప్రదర్శించకుండా వుండలేకపోయారు.

నరేంద్ర మోడీ పాదాలకు నమస్కరించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నించారు. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వైఎస్‌ జగన్‌ ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. అయినా, జగన్‌ ఆగలేదాయె! ఒకటికి రెండు సార్లు ఆ ప్రయత్నం చేశారు. అఫ్‌కోర్స్‌, వైఎస్‌ జగన్‌కి ఆ ఛాన్స్‌ నరేంద్ర మోడీ కూడా ఇవ్వలేదు. ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవం ఇప్పుడు బిక్కచచ్చిపోయినట్లయ్యింది ఈ ఉదంతంతో. జగన్‌ నమస్కారాన్ని మోడీ హుందాగా స్వీకరిస్తే అదొక లెక్క. ఒకసారి కాదు, ఒకటికి రెండు సార్లు జగన్‌ ప్రయత్నం చేయడమేంటి? నరేంద్ర మోడీ వద్దనడమేంటి? నరేంద్ర మోడీ వద్దంటున్నా, వైఎస్‌ జగన్‌ ‘ఎట్టి పరిస్థితుల్లోనూ పాదాలు తాకి తీరాల్సిందే.. లేదంటే నా జన్మ ధన్యమవదు’ అన్నట్లు వ్యవహరించడమేంటి? అని సోషల్‌ మీడియా వేదికగా చాలామంది ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

ప్రత్యేక హోదా రావాలి, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ దక్కాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి, స్టీల్‌ ప్లాంట్‌ ప్రారంభమవ్వాలి, రాజధాని నిర్మాణం జరగాలి, చాలా కేంద్ర సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరాలి.. ఇవన్నీ గడచిన ఐదేళ్ళలో చేయని నరేంద్ర మోడీని, అవేవీ చేయలేదని ఇప్పటిదాకా ఆయన్ని విమర్శించిన వైఎస్‌ జగన్‌.. ఇప్పుడాయన పాదాలకు నమస్కారం చేయాలనుకోవడం హాస్యాస్పదం మాత్రమే కాదు, అభ్యంతరకరం కూడా.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...