Switch to English

జగన్‌కి వ్యతిరేకంగా ‘స్కెచ్‌’ రెడీ చేస్తున్న మోడీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

2024 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలన్న ‘కసి’తో వుంది భారతీయ జనతా పార్టీ. తాజా ఎన్నికల్లో అత్యంత ఘోరమైన ఫలితాల్ని చూసినప్పటికీ, అత్యంత పకడ్బందీగా కార్యాచరణ రచిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాలేకపోయినా, చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించుకోగలమన్న నమ్మకంతో వున్న బీజేపీ అగ్రనాయకత్వం, ఆ దిశగా స్కెచ్‌ ప్రిపేర్‌ చేస్తున్నట్లే కన్పిస్తోంది. 2014 నుంచి 2019 నాటి పరిస్థితులు వేరు, ఇకపై పరిస్థితులు వేరంటూ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకత్వానికి ధైర్యం నూరి పోస్తోన్న ఢిల్లీ కమలనాథులు, పార్టీని ఎలా ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతం చేయాలో చెబుతూ పలు సూచనలు చేస్తున్నారట.

అయితే, రాష్ట్రానికి అదనంగా కేంద్రం నుంచి ఏ సాయం అందినా, అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలోకి వెళుతుంది తప్ప, బీజేపీకి ఏమాత్రం రాజకీయ ప్రయోజనం వుండదన్న రాష్ట్ర బీజేపీ నేతల ఆలోచనని, బీజేపీ కేంద్ర నాయకత్వం కొట్టి పారేయడంలేదు. మరోపక్క, బీజేపీ అగ్రనాయకత్వం అంటే అమిత్‌ షా – నరేంద్ర మోడీ ద్వయం మాత్రమే. ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలు రచించడంలో ఈ ఇద్దరికీ సాటి ఇంకొకరు లేరు. తెలంగాణలో అలా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించబట్టే, అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తిన్నా, లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకుంది బీజేపీ.

తొలుత గవర్నర్‌ని మార్చడం, ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం.. లాంటి వ్యూహాల గురించి ప్రస్తుతం ఢిల్లీలో చర్చ జోరుగా సాగుతోందట. అయితే, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యంత బలోపేతంగా కన్పిస్తోంది. 2024 వరకూ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఎంట్రీ కూడా కష్టమే రాజకీయంగా. ఈ నేపథ్యంలో జగన్‌ని ప్రసన్నం చేసుకుంటే, కొంత మేర ఆంధ్రప్రదేశ్‌లో బలోపేతమవ్వొచ్చన్న ఆలోచన కూడా చేస్తున్నారట బీజేపీ పెద్దలు.

బీజేపీలో చేరాలనుకుంటున్న కొందరు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఆ స్థానాల్లో సత్తా చాటాలన్నది ప్రస్తుతం బీజేపీ యోచన. ఎంపీ కేశినేని నాని బీజేపీ వైపు అడుగులు వేస్తున్న దరిమిలా, బీజేపీలో ఆయన చేరితే.. అంతకు ముందే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారట కూడా. అయితే, తద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో టీడీపీ తిరిగి గెలిస్తేనో? వైఎస్సార్సీపీ ఖాతాలోకి ఆ సీట్లు వెళితేనో? అన్న భయాలూ బీజేపీకి లేకపోలేదు. మొత్తమ్మీద, ఓ రెండు మూడు నెలల్లోనే ఆపరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ, ఢిల్లీ కమలనాథులు అన్ని సమస్యలకూ ఓ పరిష్కారం కనుగొనబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Related Posts

జగన్‌ 2.0: రోజాకి ‘హోంమంత్రి’ పదవి దక్కేనా!

చంద్రబాబుని తిడితే లాభమేంటి మోడీజీ!

సీఎం జగన్‌కి తొలి షాక్‌: బాబు, మోడీ ఒక్కటయ్యారా?

గవర్నర్ నరసింహన్ ఇన్నింగ్స్ కు ముగింపు

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...