Switch to English

అలీ అంతలా ‘కామెడీ’ అయిపోయాడా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకుని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సినీ నటుడు అలీ అనుకున్న ‘పదవి’ని సాధించలేకపోయిన మాట వాస్తవం. ‘మంత్రి పదవి హామీతోనే వైఎస్సార్సీపీలో చేరారా.?’ అన్న ప్రశ్నకు ‘కాదు’ అని సమాధానమివ్వలేకపోయిన అలీ, అప్పట్లో మీడియాని ఈ విషయంలో ఫేస్‌ చేయడానికి పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చాలాకాలం టీడీపీతో కలిసి పనిచేసిన అలీ, ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకున్నారు కొంతకాలం. తిరిగి చంద్రబాబు పంచన చేరారు. జనసేన పార్టీ వైపు కూడా అడుగులు వేసి, తనక్కావాల్సినవారికి టిక్కెట్లు ఇప్పించుకున్న అలీ, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ పవన్‌కి షాకిచ్చి, వైఎస్సార్సీపీలో చేరారు.

అయితే, తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో అలీ కొంత డైలమాలో పడిపోయారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు అలీ సాహసించకపోవచ్చు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌లో బంపర్‌ మెజార్టీతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీతో కొంత సఖ్యతగా వుంటే తనకు ఎంతో కొంత లాభం తప్ప, మంత్రి పదవి దక్కలేదన్న ‘అక్కసు’ చూపిస్తే, దానివల్ల ప్రయోజనం వుండదని అలీకి బాగా తెలుసు. ఇలాంటి ‘కమర్షియల్‌’ ఆలోచనల విషయంలో అలీకి సాటి ఇంకెవరూ రారంటారు కొందరు సినీ జనాలు.

అయితే, పవన్‌కళ్యాణ్‌తో వున్న స్నేహాన్ని అలీ తెగతెంపులు చేసుకోవడం మాత్రం, నైతికంగా అలీకి పెద్ద దెబ్బ. ఎన్నికల ప్రచార సమయంలో పవన్‌కళ్యాణ్‌, అలీ తనను వెన్ను పోటు పొడిచిన వైనం గురించి మాట్లాడితే, అలీ దానికి గట్టిగా కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నమైతే చేశాడుగానీ.. అది అలీ మనసులోంచి వచ్చిన మాట కాదు. పార్టీ అధిష్టానం ఒత్తిడితో అలీ, పవన్‌కి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చిందనేది చాలామంది చెప్పే మాట.

అలీ మాత్రమే కాదు, సినీ నటి.. నగిరి ఎమ్మెల్యే రోజా పరిస్థితి కూడా ఇప్పుడు రాజకీయాల్లో అగమ్య గోచరంగా తయారైంది. అలీ, ఎన్నికల్లో పోటీ చేయలేదు గనుక.. సినిమాల్లో యాక్టివ్‌గా వున్నాడు గనుక, కాస్తో కూస్తో అలీ పరిస్థితే బెటర్‌. రోజా పరిస్థితి మరీ దారుణం. ‘రోజాకే మంత్రి పదవి ఇవ్వలేదు.. మీకెలా ఆ పదవి వస్తుందని ఆశిస్తారు?’ అని వైసీపీకి చెందిన ముఖ్య నేత ఒకరు అలీ వద్ద వ్యాఖ్యానించేసరికి, అలీ షాకయ్యారంటూ వైసీపీ వర్గాల నుంచి ఓ లీక్‌ బయటకొచ్చింది. అదే నిజమైతే, వైసీపీలో ప్రస్తుతం అలీ పరిస్థితి ఎంత కామెడీ అయిపోయిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

Related Posts

జగన్‌కి వ్యతిరేకంగా ‘స్కెచ్‌’ రెడీ చేస్తున్న మోడీ

సీఎం జగన్‌కి తొలి షాక్‌: బాబు, మోడీ ఒక్కటయ్యారా?

ఏపీ కేబినెట్: ఐదుగురు డిప్యూటీ సీఎంలు, 20 మంది మంత్రులు

సీబీఐ కోర్టులో విచారణకు సీఎం జగన్‌ హాజరవుతారా!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...