Ugadi 2023: తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రతి ఇంట్లోనూ ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘ఉగాది తెలుగువారికి ప్రీతికరమైన పండుగ. ఉగాది తోనే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. సంక్రాంతి నాటికి పంట చేతికొస్తే..ఉగాది నాటికి వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. మన పండుగలన్నీ ప్రకృతితో మమేకమైనవే. ఈ పండుగ సందర్భంగా నా తరపున, జనసేన పార్టీ తరపున తెలుగు ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ భగవంతుడు అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
మెగాస్టార్ ఇంట ఉగాది వేడుకలు
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు తన భార్య సురేఖ, కోడలు ఉపాసనతో కలిసి పూజ చేస్తున్నప్పటికీ ఫోటోలను చిరు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ ప్రస్తుతం ‘భోళాశంకర్’ సినిమాలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ సందడి చేయనుంది.