Rangamarthanda: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘రంగమార్తాండ’ ఈరోజు ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా ఇందులోని నటులకు అభిమానులు భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఈ సినిమాలోని పాత్రలను తెలియచెప్పేలా 40 అడుగుల కటౌట్లను హైదరాబాద్ లో నెలకొల్పారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్రను తెలియజేస్తూ.. చేతిలో వైన్ బాటిల్ పెట్టి నడుస్తున్నట్టుగా, ప్రకాష్ రాజ్ ఠీవిగా నిల్చున్నట్టు, డైరెక్టర్ కృష్ణవంశీ స్టైలిష్ గా, గృహిణి పాత్ర లో రమ్య కృష్ణ కనిపించనున్నట్లు స్పురించేలా కటౌట్లను సిద్ధం చేశారు. ఈ మధ్యకాలంలో హీరోలకి తప్ప ఇతర నటులకు కటౌట్లు ఏర్పాటు చేసిన సందర్భాలు చాలా తక్కువ.
ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు.
ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. బ్రహ్మానందం తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రలో కనిపించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ తమ మార్కును చూపించారని, తమ నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోశారని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.
760558 652747i would have to make more christmas cards becuase next month is december already- 23685