మాస్ మహారాజా వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే వచ్చిన డిస్కో రాజా కూడా నిరాశనే మిగిల్చింది. అందుకే డిఫరెంట్ గా ట్రై చేయడం మానేసి తన ఇమేజ్ కి తగ్గ సినిమాలను ఎచుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నారు.
మూడు రోజుల క్రితం రిలీజైన ‘క్రాక్’ టీజర్ కి అన్ని వారాగాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇది రిలీజ్ కాగానే రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. సమ్మర్లో షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకి కూడా రవితేజ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయేలా, ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే ‘కిలాడి’ అనే టైటిల్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
రవితేజ ఇమేజ్ కి ఇలాంటి టైటిల్ పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. టైటిల్ కి తగ్గట్టుగానే రవితేజ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. రమేష్ వర్మతో ‘రాక్షసుడు’ లాంటి హిట్ సినిమా నిర్మించిన కోనేరు సత్యనారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
963483 271093Fantastic internet site you got here! Please maintain updating, I will def read far more. Itll be in my bookmarks so better update! 165556
789676 403162I really got into this post. I found it to be intriguing and loaded with exclusive points of interest. I like to read material that makes me believe. Thank you for writing this wonderful content. 869416