Switch to English

చంద్రబాబు.. లోకేష్‌.. ఎవరిది ఫస్ట్‌ ప్లేస్‌.?

తెలుగుదేశం పార్టీని వైఎస్సార్సీపీ టార్గెట్‌ చేసిన మాట వాస్తవం. అది అమరావతి భూముల వ్యవహారం కావొచ్చు, ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల వ్యవహారాలు కావొచ్చు.. ఇతరత్రా అంశాలు కావొచ్చు. ఎక్కడన్నా ఓ చిన్న లింకు దొరికితే.. ఏకంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కటకటాల వెనక్కి పంపించేయాలని వైఎస్సార్సీపీ ఉవ్విళ్ళూరుతోంది.

ప్రభుత్వం తరఫున ఏదో ఒక ఆరోపణ రావడం.. ఆ వెంటనే వైసీపీ నేతలు, ‘చంద్రబాబుని వెంటనే జైల్లో పెట్టాలి..’ అనడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతూనే, చంద్రబాబుని పూర్తిస్థాయిలో టార్గెట్‌ చేయడం షురూ అయ్యింది. ఇక, అక్కడినుంచీ అవకాశం కోసం జగన్‌ ప్రభుత్వం ఎదురుచూస్తూనే వుంది. ఈ క్రమంలో ఒక్క అవకాశాన్నీ వదులుకునేందుకు వైఎస్సార్సీపీ వెనుకంజ వేయలేదు.

అయితే, చిత్రంగా.. చంద్రబాబు మీద ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ‘దమ్ముంటే నా మీద కేసులు నమోదు చేయండి..’ అని చంద్రబాబు పదే పదే సవాల్‌ విసురుతున్నారు. ‘ఆ ముచ్చట తీర్చేస్తాం..’ అని బొత్స సత్యనారాయణ లాంటి వైసీపీ సీనియర్‌ నేతలు వెటకారం చేస్తున్న విషయం విదితమే.

అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలోనే మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి వైసీపీ ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్‌ ఇవ్వబోతోందట. ‘అది అరెస్టే కావొచ్చు..’ అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కాగా, ఇటీవల వెలుగు చూసిన ఈఎస్‌ఐ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై ఆరోపణలు చేస్తూ వచ్చిన వైసీపీ, ఇప్పుడు గేరు మార్చి.. ‘తెరవెనుక వున్నది చినబాబేనట.. ఈ విషయమై అచ్చెన్నాయుడు కూడా తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట..’ అంటూ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది.

నిజానికి, చంద్రబాబుని దెబ్బ కొట్టడం కన్నా.. లోకేష్‌ని దెబ్బ కొడితే.. ఆ దెబ్బ చంద్రబాబుకి ఇంకా గట్టిగా తగులుతుందన్నది వైసీపీ ఆలోచన. సో, ముందు లోకేష్‌.. ఆ తర్వాతే చంద్రబాబు అన్న మాట. అయితే, ఈ రాజకీయ క్రీడపై సవాలక్ష అనుమానాలూ వ్యక్తమవుతున్నాయనుకోండి.. అది వేరే సంగతి.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

వరుణ్‌ తేజ్‌ ట్వీట్‌ వెనుక ఉద్దేశ్యం ఏంటో?

నందమూరి బాలకృష్ణ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీ వారు నన్ను పిలవకుండా సీఎం కేసీఆర్‌ తో భేటీ అయ్యారు అంటూ వ్యాఖ్యలు చేయడంతో పాటు హైదరాబాద్‌ లో భూములు పంచుకుంటున్నారు అంటూ సంచలన...

షాకింగ్: మిడతల బిర్యానీ వారికి ఫేవరేట్ డిష్, ఎక్కడో తెలుసా??

కరోనా తర్వాత ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన అంశం మిడతల దండు. సౌత్ ఆఫ్రికా నుంచి పాకిస్థాన్ మీదుగా భారత్ లోకి వచ్చాయని భావిస్తున్న మిడతలు దేశంలోని రైతులను కలవర...

మనం ‘సినిమాలు’ ఎందుకు చూస్తాం.!

నేటి తరంలో వినోదం అనేది ఒక్క క్లిక్ దూరంలో ఉన్నప్పటికీ, సినిమా టికెట్ల ధరలు మన అవసరాల కంటే ఎక్కువ అయినప్పటికీ సిసలైన వినోదం కోసం థియేటర్లకు వెళ్ళి మరీ సినిమాలు చూస్తాం. అసలు...

కరోనాకి అన్ లాక్.. కేసులు పైపైకి..!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కాలంలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. జాన్ బీ.. జహాన్ బీ అనే నినాదంతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు లాక్ డౌన్...

నిమ్మగడ్డ ఎపిసోడ్‌: జనసేనకి వెరీ స్పెషల్‌.. ఎందుకంటే.!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించే క్రమంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘ఎన్నికల సంస్కరణల’ పేరిట ఆర్డినెన్స్‌ తీసుకురావడం, ఈ క్రమంలో పెద్దయెత్తున దుమారం చెలరేగడం తెల్సిన విషయమే. తాజాగా...