Switch to English

పవన్‌ కళ్యాణ్‌కి ‘ఆ తలనొప్పి’ మొదలైనట్టేనా.?

రాజకీయ పార్టీని నడపడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. గెలుపోటములకు అతీతంగా రాజకీయాలు చేయాలంటే అంతకన్నా కష్టమైన పనే. పైగా, పోటీ చేసిన రెండు చోట్లా అధినేత ఓడిపోతే.. అధినేతగా ఆ ఒత్తిడిని భరించడం ఇంకా కష్టం. అయినాగానీ, మొండి ధైర్యంతో పవన్‌ కళ్యాణ్‌ ముందడుగు వేస్తున్నారు. సరిగ్గా ఈ టైవ్‌ులోనే పార్టీని నడపడానికి తగినంత ఆర్థిక స్తోమత లేకపోవడం జనసేన అధినేతకి మరింత కలవరాన్ని పెంచుతోంది.

చేసేది లేక.. తిరిగి సినిమాల్ని ఎంచుకున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఒకేసారి మూడు సినిమాలకి కమిట్‌ అయ్యారు. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్‌ దశలో వున్నాయి. ఇంకోపక్క, రాష్ట్ర రాజకీయాల్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్‌ డెవలప్‌మెంట్స్‌ చోటు చేసుకుంటున్నాయి. నిజానికి, ఈ సమయంలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ తెరపై సమర్థవంతంగా నిలబడాల్సి వుంది. అయితే, అటు సినిమాల్ని.. ఇటు రాజకీయాల్ని బ్యాలెన్స్‌ చేయడం అంత ఈజీ కాదు.

ఆ విషయం ఇప్పుడిప్పుడే పవన్‌ కళ్యాణ్‌కి అర్థమవుతోంది. కర్నూలులో పర్యటన, అమరావతిలో పర్యటన.. వీటికి తోడు ఢిల్లీలో రాజకీయ మంతనాలు.. వీటన్నిటినీ బ్యాలెన్స్‌ చేస్తూ ఇంకోపక్క సినిమా షూటింగ్‌లు.. వెరసి పవన్‌ కళ్యాణ్‌ చాలా చాలా కష్టపడాల్సి వస్తోందని జనసేన పార్టీలో పవన్‌ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితులైన కొందరు నేతలు చెబుతున్నారు. ‘ఆయన పార్టీ కోసం 18 గంటలకు పైనే కష్టపడుతున్నారు..’ అని ఆ మధ్య జనసేన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ కోసం పడే కష్టం ఒక ఎత్తయితే.. సినిమా కోసం పడే కష్టం ఇంకో ఎత్తు.. వెరసి.. పవన్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారట. కానీ, తప్పదు.. రాజకీయాల నుంచి గ్యాప్‌ తీసుకోలేరు.. సినిమాల్ని కాదనుకోలేరు. ఈ పరిస్థితుల్ని ముందే ఊహించి.. వీలైనంత పకడ్బందీగానే ప్లాన్‌ చేస్తున్నారు.

పరిస్థితులు అంతకు మించి కరిÄనంగా మారుతున్నాయట. మరి ఈ ఎఫెక్ట్‌ పవన్‌ నటిస్తున్న సినిమాలపై పడుతుందా.? అంటే అస్సలేమాత్రం పడదంటున్నారు పవన్‌ కళ్యాణ్‌ గురించి బాగా తెలిసిన ఆయన సన్నిహితులు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

బాహుబలి నిర్మాతలు కూడా ఆ రూట్లోనే వెళుతున్నారు

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు అన్నీ మూసివేశారు. గత 70 రోజుల నుండి థియేటర్లు తెరుచుకోవట్లేదు. ఇది మరికొంత కాలం కొనసాగే అవకాశముంది. థియేటర్లు త్వరలో తెరుచుకున్నా కానీ ప్రేక్షకులు ఎంత...

వద్దన్నా వినడంలేదు.. మళ్లీ అవే రంగులు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయొద్దంటూ ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత ఆ రంగులు మార్చాలంటూ హైకోర్టు ఆదేశించగా.. వాటికి మట్టి రంగును...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. తన...

టిబి స్పెషల్: రంజాన్ రోజు ముస్లిం సోదరుల ఇంట నోరూరించే టాప్ 10 ఫుడ్స్

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఇదొక పర్వదినం.. వారి పండుగల్లో చాలా ప్రత్యేకమైనది.. నెల రోజుల ముందు నుంచే ఉపవాసం ఉంటూ, ప్రతి రోజూ నియమనిష్టలతో నమాజ్ చేస్తూ, ఎంతో పవిత్రంగా చేసుకునే...

కేజీఎఫ్‌ విషయంలో అంత పట్టుదల ఎందుకు?

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రపంచంలో పలు దేశాలు లాక్‌ డౌన్‌ అమలు చేశాయి. ఇండియాలో రెండు నెలల పాటు లాక్‌ డౌన్‌ కొనసాగింది. ఇంకా కూడా లాక్‌ డౌన్‌లోనే ఇండియా ఉంది....