Switch to English

మే 31 వరకు లాక్‌డౌన్‌: కొత్త మార్గదర్శకాలివే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే ‘లాక్‌ డౌన్‌ 4’ గురించి స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ రోజు అర్థరాత్రితో మూడో దఫా లాక్‌డౌన్‌ ముగియనున్న దరిమిలా, నాలుగో లాక్‌ డౌన్‌ రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, నాలుగో లాక్‌డౌన్‌కి సంబంధించి కొన్ని ప్రత్యేక మార్గదర్శకాల్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. రెడ్‌ జోన్లు, కంటెయిన్‌మెంట్‌ అలాగే బఫర్‌ జోన్లకు సంబంధించి రాష్ట్రాలకే నిర్ణయాధికారాన్ని కేంద్రం అప్పగించింది.

ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటాయి కేంద్ర హోంశాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో. మరోపక్క, రెస్టారెంట్లకు తీపి కబురు అందించింది కేంద్రం. పార్శిల్స్‌ వరకు రెస్టారెంట్లు నడుపుకోవడానికి వీలు కల్పించింది కేంద్రం. రాష్ట్రాల మధ్య బస్‌ సర్వీసులకు సంబంధించి ఇరు రాష్ట్రాల అంగీకారంతో నడుపుకోవచ్చని కేంద్రం తన తాజా మార్గదర్శకాల్లో పేర్కొనడం గమనార్హం.

అంటే, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ మధ్య బస్‌ సర్వీసులు నడవాలంటే, ఇరు రాష్ట్రాలూ సమ్మతించాలన్నమాట. లేనిపక్షంలో, అంతర్గతంగా ఆయా రాష్ట్రాలు బస్‌ సర్వీసుల్ని నడుపుకోవాల్సి వుంటుంది. మెట్రో రైళ్ళు, విమానాలు నడిచేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయలేదు. గ్రీన్‌ మరియు ఆరెంజ్‌ జోన్లలో మాత్రమే వెసులుబాట్లు కల్పించింది కేంద్రం. రెడ్‌ జోన్లలో మాత్రం నిబంధనలు యధాతథంగా కొనసాగుతాయి.

ఇక, సినిమా థియేటర్లకు తీపి కబురు అందలేదు. మతపరమైన కేంద్రాలు.. అంటే దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో భక్తులకు అవకాశం లేదు. స్కూళ్ళు, ఇతర విద్యా సంస్థల మూసివేత కొనసాగుతుంది. మే 31 వరకు ఈ నాలుగో దఫా లాక్‌ డౌన్‌ కొనసాగుతుంది. ఇదిలా వుంటే, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్క రోజే దాదాపు 5 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయిన విషయం విదితమే. ఈ రోజు కూడా అదే స్థాయిలో కొత్త పాజిటివ్‌ కేసులు వుండొచ్చు.మే 31 వరకు లాక్‌డౌన్‌: కొత్త మార్గదర్శకాలివే.. మే 31 వరకు లాక్‌డౌన్‌: కొత్త మార్గదర్శకాలివే..

 

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

టీం సేఫ్టీ కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్.!

ఇండస్ట్రీ హిట్ 'అల వైకుంఠపురములో', బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నఅల్లు అర్జున్, సుకుమార్ కలిసి సినిమా చేయనున్నారు అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌ ప్రస్తుతం హీరోయిన్‌ పూజా కుమార్‌ తో...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. తన...

ఫ్లాష్ న్యూస్: కరోనాతో కానిస్టేబుల్ మృతి.. పోలిస్ శాఖలో కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని...

తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై మళ్ళీ వార్తలు

నందమూరి తారక రామారావు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు....