Switch to English

తప్పక మీ సైకిల్ దొంగిలిస్తున్నా.. వీలుంటే క్షమించండి

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఎంత అల్లకల్లోలం అవుతోందో చూస్తున్నాం. ముఖ్యంగా వలస కూలీలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చేయడానికి పనిలేక, చేతిలో చిల్లిగవ్వ లేక, తినడానికి తిండి లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇక అక్కడ ఉండి చేసేదేమీ లేదని చాలామంది కాలినడకనో, ఇతరత్రా మార్గాల ద్వారాలో సొంతూళ్లకే పయనమయ్యారు. వారం రోజుల క్రితం నుంచే వలస కూలీల తరలింపునకు కేంద్రం రైళ్లు నడుపుతోంది. కానీ అందులో ప్రయాణించడానికి బోలెడు నిబంధనలతోపాట చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో పలువురు ఇతరత్రా మార్గాల్లోనే వెళ్లడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

తాజాగా ఓ వ్యక్తి రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లడం కోసం ఓ సైకిల్ దొంగిలించాడు. దానిపై దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్దామన్నది ఆయన ఆలోచన. అయితే, సైకిల్ దొంగతనం చేసేముందు దాని యజమానికి క్షమాపణ చెబుతూ ఓ కాగితం రాసిపెట్టడం విశేషం.

యూపీలోని బరేలీకి చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖాన్ రాజస్థాన్ లోని భరత్ పూర్ లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇక అక్కడ ఉండి లాభం లేదని, ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి రవాణా వసతి లేకపోవడంతో సైకిల్ దొంగిలిద్దామని నిర్ణయానికి వచ్చాడు. సాహిబ్ సింగ్ అనే వ్యక్తికి చెదిన సైకిల్ ను ఇక్బాల్ తస్కరించాడు. సాహిబ్ కు క్షమాపణ చెబుతూ రాసిన లేఖను అక్కడ ఉంచి వెళ్లిపోయాడు.

మర్నాడు తన సైకిల్ లేకపోవడం గుర్తించిన సాహిబ్ సింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాడు. ఈలోగా ఇక్బాల్ రాసిన లేఖ దొరికింది. ‘‘నమస్తే జీ.. నేనో కూలీని. నిస్సహాయుడిని. మీ సైకిల్ తీసుకెళ్తున్నాను. వీలుంటే క్షమించండి. నాకు వికలాంగుడైన పిల్లవాడు ఉన్నాడు. తన కోసం తప్పక ఈ పని చేయాల్సి వచ్చింది. మేం బరేలీకి వెళ్లాల్సి ఉంది’’ అని అందులో పేర్కొన్నాడు. దీంతో అతడి దుస్థితికి బాధపడిని సాహిబ్ సింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న ఆలోచన విరమించుకున్నాడు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

క్రైమ్ న్యూస్: కాపాడాల్సిన పోలీసే డాక్టర్ తో అసభ్య ప్రవర్తన.!

ఈ కరోనా సమయంలో డాక్టార్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులే దేవుళ్ళు అనే రేంజ్ లో ప్రజలు వారిని పొగుడుతుంటే, వారిలో కొందరు మాత్రం వారి వృత్తికే చెడ్డపేరు తెస్తున్నారు. అసలు విషయంలోకి...

ఫ్లాష్ న్యూస్: ఎమ్మెల్సీ కొడుకుని అని గృహినికి టోకరా

భరత్ కుమార్ అనే వ్యక్తి తనకు తానుగా ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకుని ఒక గృహిణిని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ కేసును ఘట్కేసర్ పోలీసులు నమోదు చేసి విచారణ...

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...

ఇన్‌సైడ్‌ స్టోరీ: తెలంగాణలో కరోనా టెస్టులు పెరగాల్సిందే.!

దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వాటన్నిటితో పోల్చి చూస్తే, హైద్రాబాద్‌ పరిస్థితి కాస్త బెటర్‌. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా...