Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: వెండితెర వద్దు.. ఓటీటీనే ముద్దు.!

టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇల్లూ ఇప్పుడు హోమ్ థియేటర్‌ లాంటిదే. అందరి ఇళ్ళూ అలాగే వుంటాయ్‌ అని అనలేంగానీ.. ట్రెండ్‌ మాత్రం బాగా మారిపోయింది. సో, థియేటర్లకు వెళ్ళి సినిమా చూడటం దండగ.. ఇంట్లోనే ఓటీటీల్లో సినిమాని సకుటుంబ సమేతంగా తిలకించేయడం పండగ.. అని చాలామంది సినీ అభిమానులు భావిస్తున్నారు.

నిజానికి, సినిమాలతో పోల్చితే, వెబ్‌ సిరీస్‌లకు అడిక్ట్‌ అవుతున్నవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. రాజమౌళి లాంటి దర్శకుడే, వెబ్‌ సిరీస్‌లలో కంటెంట్‌ అత్యద్భుతంగా వుంటోందని చెబుతున్నాడంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్‌ కారణంగా థియేటర్లు మూతబడిపోయాయి.

నిజానికి, కరోనా వైరస్‌ కంటే ముందే, వెండితెరను ఓటీటీ దారుణంగా దెబ్బకొట్టింది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ పుణ్యమా అని, సినిమాల ఊసు మర్చిపోయారు జనం.. అనే స్థాయికి వెళ్ళిపోయింది పరిస్థితి. అందుకే, మళ్ళీ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా.? రారా.? అన్న చర్చ జరుగుతోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, సినిమా థియేటర్లలో మద్యానికి అనుమతిస్తే మంచిదేమోనన్న అంశాన్ని తెరపైకి తెచ్చాడు. దీనికి చాలామంది పాజిటివ్‌గా స్పందిస్తే, కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.

మరోపక్క, ‘ఓటీటీ ముద్దు, థియేటర్లు వద్దే వద్దు’ అని నెటిజన్లు, సినీ ప్రముఖుల్ని ఉద్దేశించి సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. ‘మీరేమో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీశామని చెబుతుంటారు.. అందులో కంటెంట్‌ వుండడంలేదు. దానికి తోడు, ది¸యేటర్లు ప్రేక్షకుల్ని నిలువునా దోచేస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లు మరీ దారుణం’ అని నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్న దరిమిలా, సినీ పెద్దలూ ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుని, డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు దిగితేనే మంచిది.

నిజానికి, సినీ పరిశ్రమ ఇలాంటి సంక్షోభాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఆ మాటకొస్తే, ప్రపంచమే చూడలేదు ఇలాంటి ‘లాక్‌డౌన్‌’ పరిస్థితుల్ని ఇప్పటిదాకా. లాక్‌డౌన్‌ తర్వాత సినిమా మారాల్సిందే. ఎంతలా.. అంటే చాలా చాలా.! అదెలాగన్నది మాత్రం సినీ ప్రముఖులే ఆలోచించుకోవాలి. ఓటీటీ దెబ్బకి సినిమా పరిశ్రమ కుదేలవడం ఖాయం. సినిమా ది¸యేటర్ల పరిస్థితి భవిష్యత్తులో మరీ దయనీయం.!

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...

రెండోసారి వైరస్.. ప్రమాదకరం కాదా?

ప్రపంచానికి పెను సవాల్ గా పరిణమించిన కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. దీని ఉనికి మొదలై ఇప్పటికి ఆరు నెలలు గడిచినా.. ఈ మహమ్మారిని అదుపు చేయడానికి మానవాళి ఇంకా ప్రయత్నాలు...

క్రైమ్ న్యూస్: కలకలం రేపుతున్న బావిలో మృతదేహాలు

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ వరుసగా మృతదేహాలు బయటపడడం ఆ ప్రాంతంతో తీవ్ర కలకలం రేపుతోంది. ముందురోజు నాలుగు మృతదేహాలు లభ్యమవగా.. ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు...

ఫ్లాష్ న్యూస్: తిరుపతి లడ్డూ 25 రూపాయలకేనట

తిరుమల లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెల్సిందే. కానీ, ఆ తిరుపతి లడ్డూ చుట్టూ చాలా వివాదాలు గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం. లడ్డూ ధరల పెంపుపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నా.. టీటీడీ,...

కరోనా ఎఫెక్ట్: ముస్లీమ్ సోదరుల రంజాన్ సెలబ్రేషన్స్ లో వచ్చిన మార్పులు.!

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్‌ తో బతుకుతుంది. ఈ సమయంలో ఒక పండుగ లేదు ఒక వేడుక లేదు. సాదారణంగా అయితే ఈ సమయంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ముస్లీంలు...