Janasenani Pawan Kalyan: రాజ్యసభ సీటు దక్కించుకోవడం ఈ రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు.! ఎమ్మెల్యే పదవి అయినా, ఎంపీ పదవి అయినా.. ఎంత తేలికైన వ్యవహారాలో ఇటీవలి కాలంలో చూస్తున్నాం. ఏదో ఒక రాజకీయ పార్టీకి బాకా ఊదితే సరిపోతుంది.!
కానీ, ఓ రాజకీయ పార్టీ పెట్టి.. ప్రజల కోసం రాజకీయంగా నిలబడాలనుకుంటే మాత్రం.. ఈ రోజుల్లో అది చాలా చాలా కష్టమైన వ్యవహారం. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయంగా నిలబడేందుకు చిరంజీవి పడ్డ కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన మీద ‘కాపు ముద్ర’ వేసి, కాపు సామాజిక వర్గాన్నీ ఆయన్నుంచి దూరం చేసినోళ్ళే, ఇప్పుడాయన్ని అందరివాడు.. అని అంటున్నారు. రాజకీయం అంటేనే ఇంత.
పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా వున్నారాయన. తిరిగి జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్.
ఇన్నేళ్ళ జనసేన ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కావు. కోట్లు తెచ్చిపెట్టే సినిమా కెరీర్ ఓ వైపు.. కోట్లు ఖర్చయ్యే రాజకీయ ప్రస్థానం ఇంకో వైపు.! ఈ రెండు పడవల ప్రయాణాన్నీ విజయవంతంగా కొనసాగిస్తున్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
రాజకీయం అంటే సేవ గనుక, ఆ సేవ చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ పదవులతో సంబంధం లేకుండా విజయవంతమవుతున్నారు. తన జేబుల్లోంచి జనం కోసం ఖర్చు చేస్తున్న ఒకే ఒక్క రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాల్లో. ఆ పవన్ కళ్యాణ్‌ని జనం అధికార పీఠమెక్కించాలంటే.. వ్యవస్థల్లో మార్పులు రావాలి.
జనం కోసం చేసే ఖర్చు.. ఓట్లను కొనేందుకు చేసే ఖర్చు.. ఈ రెండిటి మధ్యా చాలా తేడా వుంది. మొదటిది ఆత్మసంతృప్తినిస్తుంది. రెండోది పదవులిస్తుంది. రెండోదానివైపు జనసేనాని చూడకపోవడమే.. ఈ పదేళ్ళలో జనసేన సాధించిన అతి పెద్ద విజయం. అధికారం దక్కితే.. ప్రజాధనాన్ని అత్యంత బాధ్యతాయుతంగా ప్రజల కోసం జనసేనాని వెచ్చిస్తారు. ప్రజాధనానికి సంబంధించి.. ప్రతి పైసాకీ జవాబుదారీతనం కావాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నది ఆ పార్టీ నినాదం.