Switch to English

Naatu Naatu Song: ఎర్ర జొన్న-మిరప తొక్కు:”నాటు నాటు” పాట మాటునున్న ఘాటు ఇదే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,050FansLike
57,202FollowersFollow

Naatu Naatu Song: ఈ “స్వర్ణగోళ” పురస్కారం అందుకున్న RRR చిత్ర గీతం నేడు ప్రపంచమంతా ప్రభంజనంలా అన్ని దిక్కులా వినిపిస్తోంది.

ఒక్కసారిగా కోట్లమంది హృదయం కొల్లగొట్టిన పాట – ప్రపంచవేదిక మీద తొలిసారిగా ఆసియాఖండం నుండి, అందునా మన తెలుగు గడ్డ నుండి దూసుకు వచ్చిన పాట – “గోల్డెన్ గ్లోబ్ 2023 – బెస్ట్ ఒరిజినల్ సాంగ్” అవార్డు కైవసం చేసుకున్న “నాటు నాటు నాటు” పాట. “RRR” చిత్రం కోసం కీరవాణి గారి సంగీత సారథ్యంలో గీత రచయిత చంద్రబోస్ గారు రాసిన అచ్చ తెలుగు జానపద నృత్య గీతం”నాటు నాటు నాటు ” పాటని ఇష్టపడని తెలుగువాడు ఉండడు.

“ఇది మన పాట, మన తెలుగుదనం ఉన్న పాట, వీక్షకులు అవాక్కయ్యేలా మన అభిమాన హీరోలు స్టెప్పులు వేసిన పాట. కనక మనకి నచ్చింది. మరి పాశ్చాత్య దేశాలలోని నూట అయిదుగురు జ్యూరీ సభ్యులకు ఎందుకు అంతలా నచ్చింది? లేడీ గాగా, టేలర్ స్విఫ్ట్, రెహానా వంటి ప్రపంచ ప్రఖ్యాత గాయనీమణుల పాటలను వెనక్కి నెట్టి, గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకొనే అంత గొప్పతనం ఆ పాటలో ఏముంది?”

అన్న విషయాలు ఆయన ద్వారానే తెలుసుకోవాలన్న కుతూహలంతో గీతరచయిత చంద్రబోస్ గారిని సంప్రదించినప్పుడు , ఆ పాటలోని సాంద్రత బోధపడేలా ప్రతీవాక్యానికీ అర్థం వివరించి చెప్పారు. ఆయన చెప్పిన అర్థం ఇలా నా వాక్యాల్లో మీ ముందు ఉంచుతున్నాను.

ముందుగా ఆ పాటను ఒక్కసారి ఆసాంతం గమనిద్దాం.

పల్లవి:-

పొలంగట్టు దుమ్ములోన
పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో
పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకొని
కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన
కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన
మిరపతొక్కు కలిపినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు

చరణం1#

గుండెలదిరిపోయేలా
డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలాగ
కీసుపిట్ట కూసినట్టు
ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు
ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు…వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు…ఊర నాటు
నాటు నాటు నాటు…గడ్డపారలాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు…ఉక్కపోతలాగ తిక్క నాటు

చరణం 2#

భూమి దద్దరిల్లేలా
ఒంటిలోని రగతమంతా
రంకెలేసి ఎగిరేలా
ఏసేయ్ రో ఎకాఎకీ
నాటు నాటు నాటు…వాహా…ఏస్కో
అరె దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే
దూకెయ్ రో సరాసరి
నాటు నాటు నాటు

–**–

ఈ పాట రాయవలసిన నేపథ్యం గురించి దర్శకులు రాజమౌళి గారు గీతరచయిత చంద్రబోస్ గారికి చెప్పినప్పుడు ‘ఇది నృత్య ప్రథానగీతం, సాహిత్యంలో సబ్జెక్ట్ మాత్రం మీ ఇష్టం’ అని పూర్తి స్వేచ్ఛని ఇచ్చారుట.

‘నృత్య ప్రథాన గీతం కాబట్టి, చిత్రం ప్రకారం వందేళ్ళ క్రితం నాటి కథ కాబట్టి- ఆనాటి పల్లె ప్రజల నృత్యoలో ఉన్న ఊపు, వేగం, నాటుదనం, తెలుగుదనం గురించి ఈనాటి యువతకు అర్థం అయ్యే రీతిలో అచ్చతెలుగు పదాల అల్లికతో ఒక పాట రాయాలి’ అని భావించారు చంద్రబోస్ గారు. ఇలాంటి చక్కని సందర్భం, స్వేచ్ఛా దొరికినప్పుల్లా తెలుగు భాషాభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు ఆయన. ఈ పాటలో అంతర్లీనంగా ఉన్న ఎన్నో అంశాలలో ఒకటి – కథలో రామ్ ఆంధ్రా నించీ, భీమ్ తెలంగాణ నించీ వస్తారు కనక, ఆయా మాండలికాలు కుడా అక్కడక్కడా స్పృశించారు రచయిత. ఇంకా లోతుగా గమనించే కొద్దీ అంతర్లీనంగా ఎన్నో ప్రత్యేకత అంశాలు ఉన్నాయి ఈ పాటలో. అవన్నీ ఈ వ్యాసంలో ముందుకెళ్ళే కొద్దీ సంపూర్ణంగా తెలుస్తాయి. ఈ నాటు పాట ఇప్పటి మాస్ సాంగ్ అనే పదానికి అప్పటి తెలుగు రూపం. అప్పట్లో నాటు – మోటు – మొరటు వంటి అచ్చతెలుగు పదాలు వాడేవారు పల్లెల్లో.

ఈ నాటు పాటలో నృత్యo ఎలా ఉండబోతోందో పల్లవిలోనే చెప్పారు కవి.

“పొలంగట్టు దుమ్ములోన పొట్లగిత్త దూకినట్టు”

అనడంలో ఒక పల్లె పౌరుషం కనిపిస్తుంది.

” పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్ట”

అనడంలో పల్లె సంప్రదాయ నృత్యంలో ఉన్న భక్తి, చిన్న గగుర్పాటుతో పాటు గొప్ప ఊపు, వేగం, పారవశ్యం… తెలీకుండానే పక్కవాడి చేత కూడా కాలు కదిపించే గుణo కనిపిస్తుంది

” కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సెసినట్టు “

అనడం ఒక కుర్రకారు సాహస విన్యాసాన్ని సూచిస్తుంది.

” మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు”

అంటే ఒక సంఘటిత యువశక్తికి సూచకం.

“ఎర్రజొన్న రోట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు”

అనడం ఆనాటి మన వ్యవసాయ సంప్రదాయాన్ని, ఆర్థిక స్థితినీ, ఆహారపుటలవాట్లనీ, అదిచ్చే చేవనీ సూచిస్తుంది.

పల్లవిలో ఆ నాటు నాట్య విన్యాసాలను- ఆనాటి మన సామాజిక అంశాలలోని చేవతో పోల్చారు.

మొదటి చరణంలో… ఆ నృత్యం వల్ల ఒంట్లోని ప్రతీ అంగం ఎలా పూనకాలతో పులకరించిపోతోందో చెప్పారు చంద్రబోస్ గారు.

” గుండెలదిరిపోయేలా డoడనకర మోగినట్టు

సెవులు సిల్లు పడేలాగ

కీసుపిట్ట కూసినట్ట

ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు

కాలు సిందు తోక్కేలా దుమ్మారం రేగినట్టు

ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు”

అనడంలో

ఆ పల్లె నాటు నృత్యానికి గుండె అదురు పెరిగి, వేళ్లతో చిటికెలు వేసి, కాలు కదం తొక్కి, ఒళ్ళు చెమట పట్టి ఆపాదమస్తకం పరవశంతో ఊగిపోతుంది అని స్వభావోక్తి అలంకారం స్ఫురించేలా చెప్పారు కవి. ఇక్కడ కీసుపిట్ట గురించి చెప్పుకోవాలి, ఇదేదో పిచ్చుకలాగా కాలగర్భంలో కలిసిపోయిన పిట్ట కాదు, తెలంగాణా మాండలీకంలో కీసుపిట్ట అంటే ఈల వేయడం.ఇది పాతకాలం నాటి పల్లెపదం.

అలాగే రెండో చరణంలోని ఉపమానాలలో కవితాత్మక భావావేశం గోచరిస్తుంది.

“భూమి దద్దరిల్లేలా… ఒంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా,

దుమ్ము దుమ్ము దులిపేలా

లోపలున్న పానమంతా దుముకుదుముకులాడేలా”

అనడంలో, వేగం హెచ్చిన నాట్యం వల్ల రక్తం అంతా ఎగజిమ్మడాన్ని కూడా రోషంగా, కవితాత్మకంగా…”రగతమంతా రంకెలేసి ఎగరడం” అంటూ పౌరుషాన్నీ, పోటీతత్వాన్ని సూచించేలా గొప్పగా భావవ్యక్తీకరణ చేశారు రచయిత.

“లోపలున్న ప్రాణం అంతా ఆవేశంగా ఉప్పొంగింది” అనే ఉత్ప్రేక్షని తెలంగాణా మాండలీకంలో “లోపలున్న పానమంతా దుముకు దుముకులాడటం” అంటూ కవితాత్మకoగా వ్యక్తపరిచారు చంద్రబోస్ గారు.

.అలాగే, తొక్కు, కీసుపిట్ట, పానం దుముకులాడటం వంటి తెలంగాణ మాండలీకాలనీ, వాటితోపాటే ఆంధ్రా మాండలీకాలనీ కుడా సమానంగా పాటనిండా పోదిగారు రచయిత.

కళారూపం ఏదయినా… అది ప్రజల వాడుక మాటల్లో ఉన్నప్పుడే అది అన్ని వర్గాల వారిని చేరి సంపూర్ణత్వం సంతరించుకొని పదికాలాల పాటు నిలబడుతుంది.

ఇంత భావసాంద్రత ఉన్న ఈ పాటను “గోల్డెన్ గ్లోబ్” జ్యూరీలోని సభ్యులయిన దర్శకులు, రచయితలు, విమర్శకులు, సామాన్య శ్రోతలు, విభిన్న విభాగాలకు చెందిన నూటయిదుగురు జడ్జీలు, ఆంగ్లంలోకి అనువదించుకొని, ప్రతీ మాటను క్షుణ్ణంగా అవగతం చేసుకొని, అందులో అభ్యంతరకరమైన అంశాలు కానీ, ఎవరి మనోభావాలు దెబ్బతినే అంశాలు కానీ లేవని ఒకటికి వందసార్లు గమనించుకొని, భావవ్యక్తీకరణ శైలిని కుడా గమనించి ఒక నిర్ణయానికి వచ్చారు, శ్రోతల ఉత్సాహం ద్విగుణీకృతం చేసే గొప్ప సంగీతం అందించిన కీరవాణి గారి బాణీ కుడా, నూటైదుగురు జ్యూరీ సభ్యులకు వంక పెట్టడానికి లేనివిధంగా నచ్చి ఈ గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డుని సగర్వంగా ప్రకటించారు.

ఈ పోటీలో ప్రపంచ ప్రఖ్యాత గాయనీమణులు, లేడీ గాగా, టేలర్ స్విఫ్ట్, రెహానా వంటి వారిని దాటుకొని ఒక తెలుగువాడి పాట గెలిచింది. ఆసియా ఖండం నించి తొలిసారిగా, నిజానికి భారతదేశం నుండి కుడా తొట్టతొలిసారిగా ఒక సంగీత దర్శకుడు, గీత రచయిత ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడం, తెలుగు పాట ఘనతను లోకానికి సగర్వంగా చాటిచెప్పడం అనేది చారిత్రకం. ఆ సంగీత దర్శకుడు – గీత రచయిత మన తెలుగువారైన కీరవాణి గారు చంద్రబోస్ గారు అవడం ప్రతీ తెలుగోడి గుండెకీ ఆనందదాయకం.

“చరిత్రలో నీకో కొన్ని పెజీలుండాలి”

అని తన కలంతో చెప్పి ఆగక, దాన్ని నిజం చేసి చూపించారు చంద్రబోస్ గారు.

ఈ సందర్భంగా, గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత శ్రీ కీరవాణి గారికీ, శ్రీ చంద్రబోస్ గారికి ప్రతీ తెలుగు ప్రేక్షకుడి తరఫున శతాధిక శుభాకాంక్షలు.
జైహింద్.

Article Courtesy
మాధురి ఇంగువ
రచయిత్రి(USA)

80 COMMENTS

  1. My programmer is trying to convince me to move to .net from PHP.
    I have always disliked the idea because of the costs.
    But he’s tryiong none the less. I’ve been using WordPress on a number of
    websites for about a year and am anxious about switching to another platform.
    I have heard very good things about blogengine.net. Is there a way
    I can transfer all my wordpress content into it?

    Any help would be greatly appreciated!

  2. What i don’t realize is in reality how you are not actually a lot more neatly-appreciated than you may be now.
    You are so intelligent. You understand thus considerably with regards to this matter, made me individually
    imagine it from a lot of varied angles. Its like women and men are
    not interested except it’s something to do with Woman gaga!

    Your individual stuffs outstanding. All the time maintain it up!

  3. What you published made a bunch of sense. However, think on this, what if you were
    to write a killer title? I am not saying your information is not good., but suppose you added a
    headline that makes people want more? I mean Naatu Naatu Song:
    ఎర్ర జొన్న-మిరప తొక్కు:"నాటు నాటు" పాట మాటునున్న ఘాటు ఇదే..

    is kinda vanilla. You should look at Yahoo’s home page and
    watch how they create post headlines to get viewers to open the
    links. You might add a related video or a pic or two to get people interested about everything’ve got to say.
    In my opinion, it would bring your blog a little livelier.

  4. I recently tried CBD gummies for the opening unceasingly a once and I be obliged demand, I’m impressed with the results. I felt more nonchalant [url=https://www.cornbreadhemp.com/products/full-spectrum-cbd-gummies]full spectrum cbd gummies best[/url] and at ease, and my dread was significantly reduced. The gummies tasted colossal and were mild to consume. I’ll for all be using them again and would urge them to anyone looking representing a natural procedure to alleviate accent and anxiety.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej- Lavanya Tripathi: మెగా ఇంట మోగనున్న పెళ్లి బాజాలు?

Varun Tej- Lavanya Tripathi: అందరి అనుమానమే నిజమయ్యేలా కనిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi)...

Tamilnadu: చనిపోయిందనుకొని కన్నతల్లికి అంతక్రియలు.. మర్నాడే ఇంట్లో ప్రత్యక్షం

Tamilnadu: తల్లి చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేసాడో కొడుకు. ఆ మరుసటి రోజు ఆమె ఇంటి ఎదురుగా ప్రత్యక్షం అయింది. ఇదేదో సీనియర్ ఎన్టీఆర్ సినిమా 'యమగోల'...

Prabhas-Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ‘బాహుబలి’ మాదిరిగా కాదట

చిన్న సినిమాలు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మారుతి చకచక సినిమా...

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు:...

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'నా వల్ల...

Vyuham: ఇది రాంగోపాల్ వర్మ “వ్యూహం”

Vyuham: ‘‘నేను అతి త్వరలో ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్‌ కాదు.. బయోపిక్‌ కన్నా లోతైన రియల్‌ పిక్‌. బయోపిక్‌లో అబద్ధాలు...

రాజకీయం

YS Jagan: జగనన్నా.! జనం గేట్లు దూకి ఎందుకు పారిపోతున్నారన్నా.?

YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ...

Kesineni Nani: ఎంపీ కేశినేని నాని టీడీపీలో వున్నట్టా.? లేనట్టా.?

Kesineni Nani: కేశినేని నాని.. ఒకప్పుడు కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్‌తో వార్తల్లో వ్యక్తిగా వుండేవారు. టీడీపీ ఎంపీ అయ్యాక, కేశినేని నాని పొలిటికల్ హంగామా వేరే లెవల్‌కి చేరింది. ఏ పార్టీలో...

Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి ఈజ్ బ్యాక్.! కండిషన్స్ అప్లయ్.!

Vijay Sai Reddy: ఎట్టకేలకు విజయసాయిరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా ‘రాజకీయ ప్రత్యర్థులపై’ పంచ్ డైలాగులు పేల్చడం...

జగన్ పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడు అంటున్న మాజీ సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోయే విధంగా అరుదైన ఘనత సొంతం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బిజెపిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. మరో...

YS Avinash Reddy: అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఓ పనైపోయింది.!

ఔను, అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఔను, ఓ పనైపోయింది.! ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు.. అంటూ మీడియాలో రచ్చ ఇకపై వుండదు.! కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద...

ఎక్కువ చదివినవి

North Korea: కిమ్ రాజ్యంలో రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు

North Korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్( Kim jong un) వేసే శిక్షలు ఎంత అమానవీయంగా ఉంటాయో తెలిసిందే. తనకి ఎదురు తిరిగితే ఎంతటి వారినైనా కఠోరంగా శిక్షిస్తూ ఉంటాడు....

Prabhas-Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ‘బాహుబలి’ మాదిరిగా కాదట

చిన్న సినిమాలు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మారుతి చకచక సినిమా పనులు ముగించేస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమా గురించి...

వ్యాపార రంగంలో రాణిస్తూ, సేవా కార్యక్రమాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న యల్లటూరు శ్రీనివాసరాజు

వ్యాపార రంగంలో అంచలంచెలుగా ఎదిగినవాళ్ళు, తాము సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తుంటారు. అలా సేవా కార్యక్రమాలు చేయడంలో ఆత్మ సంతృప్తి కలుగుతుందని చెబుతుంటుంటారు. రాజకీయం అంటేనే సేవ.! కానీ,...

Varun Tej- Lavanya Tripathi: మెగా ఇంట మోగనున్న పెళ్లి బాజాలు?

Varun Tej- Lavanya Tripathi: అందరి అనుమానమే నిజమయ్యేలా కనిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈనెల 9న...

Hina Khan: పబ్లిక్ లో బాలీవుడ్ నటి వెకిలి చేష్టలు

బుల్లి తెర ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో ఎదిగింది హీనా ఖాన్( Hina khan). హిందీ సీరియల్స్ లో సంప్రదాయంగా కనిపించడంతో ఈమె ఫ్యామిలీ ఆడియన్స్ కి...