కోల్‌కతా కి చెందిన రిచా సింగ్ అనే అమ్మాయి చదివింది 12 వ తరగతి అయినా కోల్‌కతా కే డిప్యూటీ కమీషనర్ అయింది . అదేంటి ఇంటర్మీడియట్ తోనే పోలీస్ కమీషనర్ అయిపోవచ్చా అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజం ఆ అమ్మాయి 12 వ తరగతి చదువుతోనే డిప్యూటీ కమీషనర్ అయింది, పైగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఆమె తండ్రికి బాస్ అయ్యి ఆయన్ను ఆదేశించేందుకు రెడీ అయ్యింది. అసలు విషయంలోకి వెళితే..
జీడీ బిర్లా సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్‌లో చదివిన రిచా ఇటీవల విడుదలైన 12 వ తరగతి పరీక్షలలో 99. శాతం మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది. అలాగే ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించిన పోలీస్ అధికారులు ఆమెని పోలీస్ కార్యాలయానికి పిలిపించి అభినందనలు తెలిపారు అంతేకాదు ఆమె ఒక్క రోజు డిప్యూటీ కమీషనర్ గా కొనసాగుతుంది అని ఉన్నతాధికారులు తెలిపారు. ఆమె ఘనతను ప్రశంసిస్తూ అరుదైన అవకాశం కల్పించామని తెలిపారు.
ఇదిలా ఉంటే రిచా తండ్రి రాజేశ్ సింగ్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్‌లో అడిషనల్ ఇన్‌ఛార్జి గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీని పై రిచా సింగ్ ని ఉన్నతాధికారులు మీ నాన్న కి నువ్వు ఏం ఆదేశిస్తావని అడగగా ‘తన తండ్రి ని త్వరగా ఇంటికి వెళ్ళమని ఆదేశిస్తా’ అని చెప్పింది. అదే విషయం రాజేష్ సింగ్ ని అడగగా ఇప్పుడు తన కూతురు నాకు పై అధికారి కాబట్టి ఆమె ఏమి చెప్పిన తన ఆదేశాలను శిరసావహిస్తా’ అని సంతోషంతో చెప్పుకొచ్చారు.