Switch to English

అలా చేయగలిగితే జగన్‌కి సెల్యూట్‌ చెయ్యాల్సిందే.!

ఓ వైపు ప్రపంచాన్ని కరోనా వైరస్‌ ముంచెత్తుతోంటే, ఇంకోపక్క గ్రామ వాలంటీర్‌ వ్యవస్థపై ప్రమోషన్‌ కార్యక్రమాన్ని షురూ చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. మనకున్న బలం ఏంటంటే.. అంటూ గ్రామ వాలంటీర్ల గురించి ప్రస్తావించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, కరోనా వైరస్‌ పట్ల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన కార్యక్రమంలో. నిజమే, ఈ విషయంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అభినందించి తీరాల్సిందే.

పార్టీ కార్యకర్తలకే గ్రామ వాలంటీర్లుగా అవకాశమిచ్చామని సాక్షాత్తూ ఎన్‌2 (అదేనండీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ జగన్‌ నెంబర్‌ వన్‌ అయితే, తర్వాతి స్థానం నెంబర్‌ టూ కదా..) విజయసాయిరెడ్డి సెలవిచ్చి అగ్గి రాజేస్తే, విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వెల్లువెత్తాయనుకోండి.. అది వేరే సంగతి. ఆ గ్రామ వాలంటీర్లు ఇప్పుడు అక్కరకు వచ్చేలా వున్నారు. ఇంటింటికీ వెళ్ళి పరిస్థితుల్ని తెలుసుకుని, ప్రభుత్వానికి నివేదించగల సత్తా ఈ వాలంటీర్లకు వుంది. కానీ, ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌, ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా వ్యాప్తి చెందితేనో.? అన్న అనుమానాలూ లేకపోలేదు. ‘ఇంట్లోనే వుండండి.. తగిన వైద్యం తీసుకోండి..’ అంటూ కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తత గురించి ప్రభుత్వాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో అలా ఇంట్లో వుండేవారికి వైద్య సహాయం అందించడానికి వాలంటీర్లు బాగా ఉపయోగపడ్తారు. మరోపక్క, పరిస్థితి తీవ్రతను అంచనా వేసేలా వాలంటీర్లకు ప్రభుత్వం కరోనా వైరస్‌పై శిక్షణ ఇప్పించిందా.? ఒకవేళ ఇప్పటికే ఇప్పించకపోతే, ముందు ముందు శిక్షణ ఇప్పించేంత సయమం వుంటుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అత్యవసర మందులు, తక్షణ వైద్య సహాయం.. వంటివి ఇంటింటికీ అందించడానికీ ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉపయోగపడ్తుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ కరోనా వైరస్‌ పట్ల ప్రజల్లో పెద్దగా అవగాహన కన్పించడంలేదంటే, అది ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకోవాలి.

స్థానిక ఎన్నికల మీద, కుల రాజకీయాల మీద పెట్టిన శ్రద్ధ.. ప్రజారోగ్యం మీద ముఖ్యమంత్రి పెట్టలేదన్న విమర్శల్ని అంత తేలిగ్గా తీసి పారేసే సందర్భం కాదిది. రాజకీయాల సంగతెలా వున్నా, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థని అత్యంత సమర్థవంతంగా గనుక ఉపయోగించగలిగితే, వైఎస్‌ జగన్‌కి సెల్యూట్‌ చెయ్యాల్సిందే .

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకున్న దాసు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా తన అభిమానంను చాటుకున్నాడు. ఎన్టీఆర్‌ పై అభిమానం ఉందని మాటలు...

జగన్‌ సర్కార్‌కి ఝలక్‌: డాక్టర్‌ సుధాకర్‌ కేసు సీబీఐకి.!

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ సుధాకర్‌ ఉదంతంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లో మద్యంతర నివేదిక అందించాలని ఈ...

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

రోడ్డెక్కిన బస్సులు.. భయం భయంగానే ప్రయాణం.!

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో ఇప్పటికే బస్సులు రోడ్డెక్కగా, ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఛార్జీల పెంపు...