Switch to English

బుగ్గనా.. ఈ చెత్త రాజకీయం మత్‌ ‘కరోనా’.!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అత్యంత పతనావస్థకు దిగజారిపోయాయి. అయినాగానీ, ఇంకా ఆ పతనం తాలూకు లోతుల్ని వెతికేందుకు ఏమాత్రం మొహమాటపడటంలేదు రాజకీయ నాయకులు. మరీ ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ‘కరోనా’ మీద ఫోకస్‌ కంటే, రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్‌ పెడుతుండడం గమనార్హం. మంత్రులు.. ముఖ్యమంత్రి సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అధికారికంగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జనం బిక్కుబిక్కుమంటున్నారు ఏ క్షణాన పరిస్థితి ఎలా ముంచుకొస్తుందో తెలియక.

ఈ పరిస్థితుల్లో జనానికి భరోసా ఇవ్వాల్సిన అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా ప్రభుత్వంలో వున్నవారు.. నిస్సిగ్గుగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికూడా చేరిపోవడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోవడానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కారణమనీ, ఇదంతా తెరవెనుకాల టీడీపీ ఆడిస్తున్న నాటకంలో బాగమేనని బుగ్గన ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుకి తనదైన భాష్యం చెప్పారు బుగ్గన. సరే, రాజకీయాలు మాట్లాడుకునేందుకు సమయం చాలానే వుంది. ఇప్పుడు రాష్ట్రం, దేశం మాత్రమే కాదు.. ప్రపంచమే సంక్షోభంలో పడింది.

ఓ పక్క, ‘యుగాంతం’ అనే పుకార్లు విన్పిస్తున్నాయి. ఈ సమయంలో, ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పనిచేయాలి. అంటే, అధికారంలో వున్నవారు పూర్తిగా రాజకీయాల్ని పక్కన పెట్టేయాలి. కరోనా కట్టడి గురించి ఆలోచించాలి. ‘కరోనా గురించి తర్వాత మాట్లాడదాం..’ అంటూ ప్రెస్‌ మీట్‌లో రాజకీయాలు ఊదరగొట్టేశారు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. ఉత్తరప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం, కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఉపాధి కోల్పోయే రోజువారీ కూలీలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యం వుందా.? లేదా.? పోనీ, అలాంటి ‘మంచి’ ఆలోచనలు చేయడంలేదు సరికదా.. ఈ చెత్త రాజకీయాలు అయినా చేయకుండా వుంటారా.? అంటే అదీ లేదు. అందుకే, నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.. ‘బుగ్గనా.. ఈ చెత్త రాజకీయం మత్‌ కరోనా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. పాలకులు బాధ్యత మరిస్తే, ప్రజలు ఆ బాధ్యతల్ని పాలకులకు గుర్తు చెయ్యాలి కదా మరి.!

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: కలకలం రేపుతున్న బావిలో మృతదేహాలు

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ వరుసగా మృతదేహాలు బయటపడడం ఆ ప్రాంతంతో తీవ్ర కలకలం రేపుతోంది. ముందురోజు నాలుగు మృతదేహాలు లభ్యమవగా.. ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు...

పిక్ ఆఫ్ ది డే: సమ్మర్లో బికినీతో సెగలు పుట్టిస్తున్న వరుణ్ తేజ్ బ్యూటీ.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ దిశా పటాని. ఆ తర్వాత తెలుగులో...

క్రైమ్ న్యూస్: భార్యను చంపేందుకు ఆ భర్త చేసిన ప్లాన్‌కు ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న సూరజ్‌కు అప్పుడే భార్య అంటే విరక్తి పుట్టింది. మరో పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని భావించిన సూరజ్‌ ఆమెను చంపేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. అద్బుతమైన...

ఇండియాలో అక్కడ మాత్రమే కరోనా లేదు

ప్రపంచంలో దాదాపుగా 125 దేశాల్లో కరోనా వైరస్‌ నమోదు అయ్యింది. కొన్ని దేశాలు వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో మాత్రం స్పల్పంగానే కరోనా ప్రభావం...

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...