ఓ మ్యాట్రిమోని సైట్ లో పెళ్లి సంబంధాల కోసం వెతుకున్న వరుడిని ఓ యువతి నమ్మించి నిలువునా ముంచేసింది. అతడిని నగ్నంగా చూడాలని కోరి.. ఆపై దానిని రికార్డింగ్ చేసి బెదిరింపులకు పాల్పడింది. ఇప్పటివరకు రూ.20వేలు వసూలు చేసిన ఆ కిలేడీ బాధ పడలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు హులిమావులోని ఆర్ఆర్ లేఅవుట్ నివసించే 33 ఏళ్ల వ్యాపారవేత్త పెళ్లి సంబంధాల కోసం జీవన్ శాంతి అనే మ్యాట్రిమోని సంస్థలో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రేయ అనే అమ్మాయి అతడిని సంప్రదించింది. క్రమంగా ఇరువురి పరిచయం పెరిగింది. రోజూ ఫోన్లు, చాటింగ్ లు చేసుకునేవారు.
ఇదిలా ఉండగా.. ఈనెల 7న శ్రేయ ఓ కోరిక కోరింది. అతడిని న్యూడ్ గా చూడాలని ఉందని చెప్పింది. తాను కూడా అలా కనపడతానని చెప్పి, ఆ మేరకు తన న్యూడ్ ఫొటో పంపించింది. దీంతో అతడు కూడా న్యూడ్ గా కనిపించడానికి రెడీ అయ్యాడు. ఈ మేరకు వీడియో కాల్ చేసి న్యూడ్ గా కనిపించాడు. అనంతరం ఆమె అతడిని బెదిరించింది. ఈ వీడియో మొత్తం రికార్డు చేశానని, రూ.లక్ష ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో లబోదిబోమన్న బాధితుడు తొలుత ఆమెకు రూ.5వేలు పంపించాడు. ఇంకా ఒత్తిడి చేయడంతో మరో రూ.15వేలు ఆమె ఖాతాలో వేశాడు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
898992 785499In case you tow a definite caravan nor van movie trailer your entire family pretty soon get exposed to the down sides towards preventing very best securely region. awnings 383971
457889 474371This web site is really a walk-through it really could be the details you wanted concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll totally discover it. 278486