Switch to English

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు కాకపోవచ్చు. కానీ, ఇంకొకరిపై విషం చిమ్మడం.. వ్యభిచారం కంటే హీనం.!

మెగాస్టార్ చిరంజీవి, గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ నేత. రాజ్యసభ పదవీ కాలం ముగిశాక, కాంగ్రెస్ పార్టీలో ఏనాడూ ఆయన కొనసాగింది లేదు. అసలు ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు. కాంగ్రెస్ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయలేదు కాబట్టి.. అనే ఓ కుంటి సాకుతో, ఇంకా ఆయన్ని కాంగ్రెస్ నేతగా ఎవరైనా భావిస్తే అంతకన్నా హాస్యాస్పదం వుండదు.

‘రాజకీయాలకు నేను దూరం. నేను ఏ పార్టీలోనూ లేను. నా తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్ నడుపుతున్న జనసేన పార్టీలో కూడా చేరలేదు. కాకపోతే, తమ్ముడు కదా.. పవన్ కళ్యాణ్‌కి అన్నగా నా మోరల్ సపోర్ట్ వుంటుంది..’ అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి ఓ సందర్భంలో.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పాత పరిచయాల నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని కలుస్తున్నారు. చిరంజీవి మద్దతునీ కోరుతున్నారు.

సినిమా నటులు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, ఆయా రాజకీయ నాయకుల తరఫున ఎన్నికల ప్రచారంలో కనిపిస్తుండడం చూస్తున్నాం. వారి మీద వ్యక్తిగత ద్వేషం ఎవరికైనా ఎందుకు వుంటుంది.?

కానీ, చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, బాహాటంగా ఏ రాజకీయ పార్టీకీ మద్దతు పలక్కపోయినా, ఆయన మీద విషం చిమ్మడం మాత్రం ఆగడంలేదు. ప్రధానంగా వైసీపీ అను‘కుల’ మీడియా, అందునా పాత్రికేయాన్ని వెబ్ చారంగా మార్చేసిన వెబ్ మీడియా, చిరంజీవిని కాంగ్రెస్ నేతగా చూపిస్తూ, ‘సంస్కార పాఠాలు’ వల్లిస్తోంది.

చిరంజీవి కాంగ్రెస్ నాయకుడనీ, నైతిక విలువలకు తిలోదకాలిచ్చేసి బీజేపీ, టీడీపీ అభ్యర్థుల తరఫున రాజకీయంగా వకాల్తా పుచ్చుకుంటున్నారనీ సదరు వెబ్‌చార మీడియాలో కథనాల్ని వండి వడ్డిస్తున్నారు.

ముందే చెప్పుకున్నట్లు, చిరంజీవి రాజకీయాల్లో లేరు. గతంలో వైసీపీ తీసుకున్న మూడు రాజధానుల “నిర్ణయానికీ” చిరంజీవి మద్దతిచ్చారు. ఇప్పుడు తనను కలస్తున్న పలువురు అభ్యర్థులను ఆశీర్వదిస్తున్నారు, వారి గెలుపును ఆకాంక్షిస్తున్నారు. పైగా, పవన్ కళ్యాణ్ కేంద్రంగానే టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఏర్పాటయ్యింది.

ఈ నేపథ్యంలో తమ్ముడి రాజకీయ ఎదుగుదలని ఆకాంక్షిస్తూ, కూటమి అభ్యర్థులు గెలవాలని చిరంజీవి కోరుకోవడం తప్పెలా అవుతుంది.? మొన్నీమధ్యనే తమ్ముడి పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు చిరంజీవి. అది కూడా జనసేన పార్టీ, కౌలు రైతుల కుటుంబాలకు చేస్తున్న సాయానికి చేదోడుగా వాదోడుగా ఆ ఐదు కోట్లు అవసరమవుతాయని చిరంజీవి ఆ విరాళం ఇచ్చారు.

కుల జాడ్యం తప్ప, చిరంజీవికి వ్యతిరేకంగా కథనాలు రాయడానికి ఈ వెబ్‌చార మీడియాకి వేరే కారణం దొరకదు. వైసీపీ అను‘కుల’ మీడియా కదా.?

రాజకీయాల్ని నేరస్తులు శాసిస్తున్న రోజులివి. అలాంటి నేరగాళ్ళకు మీడియా వంత పాడటం.. కుల జాడ్యంతో అలాంటి నేరగాళ్ళకు మద్దతివ్వడం.. ఇదంతా చూస్తోంటే, మీడియా ఎక్కడుంది.. అంతా మాఫియానే.. అనిపించకమానదు.! వెబ్..చారం.. మాఫియా.. ఇదా పాత్రికేయమంటే.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...